బిజినెస్

శ్రమజీవుల సొంతింటి కల కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఇపిఎఫ్‌ఒ.. త్వరలో తమ 4 కోట్ల ఖాతాదారుల సొంతింటి కలను సాకరం చేసే అవకాశం కనిపిస్తోంది. చౌక ధరల గృహాలను కొనుగోలు చేయడానికి తమ ప్రావిడెంట్ ఫండ్‌ను తాకట్టు పెట్టే వీలును ఖాతాదారులకు కల్పించాలని ఇపిఎఫ్‌ఒ యోచిస్తున్నది తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన పథకాన్ని త్వరలో అమల్లోకి తేవాలని ఇపిఎఫ్‌ఒ భావిస్తోంది. ‘ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్‌ఒ) సభ్యుల కోసం ఓ హౌజింగ్ స్కీమ్‌ను తీసుకురావాలని మేము పనిచేస్తున్నాం. ఈ పథకంలో భాగంగా గృహాలను కొనుగోలు చేయడానికి సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్‌ను తాకట్టు పెట్టుకోవచ్చు.’ అని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్ పిటిఐకి తెలిపారు. వచ్చే నెల జరుగుతుందని అనుకుంటున్న ఇపిఎఫ్‌ఒ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సిబిటి) సమావేశంలో తమ ప్రతిపాదనను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఒక్కసారి సిబిటి ఆమోదం లభిస్తే.. ఇక ఖాతాదారులకు పథకం అమల్లోకి వచ్చినట్లేనని పేర్కొన్నారు. కాగా, ఈ పథకం.. ఖాతాదారుల్లో ఎవరికి వర్తిస్తుంది. ఎలా వర్తిస్తుంది అన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉందన్నారు. ఖాతాదారులకు ఎలాంటి ఆంక్షలు విధించబోమన్న అగర్వాల్.. భూములను కొనడంగానీ, ఇళ్లను నిర్మించడంగానీ చేయబోమని స్పష్టం చేశారు. బహిరంగ మార్కెట్‌లో తమకు నచ్చిన గృహాలను ఎంచుకుని, ప్రావిడెంట్ ఫండ్ సహాయంతో కొనుక్కోవచ్చన్నారు. అయితే తక్కువ వేతనం కలిగిన శ్రమజీవులకే ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఇపిఎఫ్‌ఒ నిపుణుల కమిటీ అనుకుంటోంది. తమ మొత్తం ఉద్యోగ జీవితంలో సంపాదించే సొమ్ముతోనైనా ఓ ఇళ్లును కొనలేనివారికే అవకాశాన్నివ్వాలని సిఫార్సు చేసింది. ఇకపోతే ప్రావిడెంట్ ఫండ్‌ను తాకట్టుపెట్టి గృహ రుణం పొందేవారు.. నెలనెలా వాయిదాల రూపంలో తీసుకున్న రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణానికి సంబంధించి సభ్యుడు, బ్యాంక్/హౌజింగ్ ఏజెన్సీ, ఇపిఎఫ్‌ఒ మధ్య ఒప్పందం కుదురుతుంది. నిజానికి నిరుడు సెప్టెంబర్ 16న జరిగిన సిబిటి సమావేశంలోనే ఈ ప్రతిపాదనను ఇపిఎఫ్‌ఒ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా దీనిపై ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ సిఫార్సులనూ సమర్పించడం జరిగింది. అయినప్పటికీ ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈసారి జరిగే సమావేశంలో తప్పక ఓ నిర్ణయం వెలువడుతుందని, అది ఖాతాదారుల సొంతింటి కలకు అనుగుణంగానే వస్తుందన్న ఆశాభావాన్ని అగర్వాల్ వ్యక్తం చేశారు. ఈ ఏడాది మే నెలలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కూడా లోక్‌సభలో ఓ లిఖితపూర్వక సమాధానంగా ఈ పథకం గురించి వెల్లడించినది తెలిసిందే.