బిజినెస్

మార్కెట్‌కు కొత్త గవర్నర్ కిక్కు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ వారం ఆర్‌బిఐ నూతన గవర్నర్ నియామకోత్సాహం కనిపించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) 24వ గవర్నర్‌గా.. డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను కేంద్ర ప్రభుత్వం శనివారం ఎంపిక చేసినది తెలిసిందే. ఈ నేపథ్యంలో మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరచవచ్చని, దీంతో సూచీలు లాభాల్లో పరుగులు పెట్టవచ్చని విశే్లషకులు అంటున్నారు. ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్‌కు దేశ ఆర్థిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండటం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరుస్తుందని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుత విధానాల్లో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చని, దానివల్ల మదుపరులు కొత్త పెట్టుబడుల దిశగా ముందుకు వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇదే అభిప్రాయాన్ని శామ్కో సెక్యురిటీస్ సిఇఒ జిమ్మిత్ మోదీ వ్యక్తం చేశారు. ‘దేశ, విదేశీ సంస్థాగత మదుపరులు.. రాజన్ వారసుడిగా పటేల్‌ను స్వాగతిస్తున్నారు. ఆర్‌బిఐ ఇకపైనా స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకుంటుందన్న విశ్వాసాన్ని దీంతో మదుపరులు కనబరిచినట్లవుతోంది. దీంతో సహజంగానే స్టాక్ మార్కెట్లూ లాభాల్లో నడిచే వీలుంది’. అని పిఎమ్‌ఎస్, ప్రభుదాస్ లిల్లధర్ సిఇఒ, చీఫ్ పోర్ట్ఫోలియో మేనేజర్ అజయ్ బోడ్కే అన్నారు. ‘ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నిష్క్రమణపై గతకొద్ది నెలలుగా వ్యక్తమవుతున్న ఆందోళనలు పటేల్ నియామకంతో ఇక తగ్గుముఖం పట్టగలవు’. అని ఎమ్‌కె గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్థికవేత్త, వ్యూహకర్త, సంస్థాగత పరిశోధన విభాగం అధిపతి ధనంజయ్ సిన్హా అన్నారు. రాజన్ విధానాలను పటేల్ కూడా కొనసాగించగలరన్న అభిప్రాయాన్ని జియోజిత్ బిఎన్‌పి పరిబాస్ పెట్టుబడుల వ్యూహకర్త వికె విజయకుమార్ వెలిబుచ్చారు. ఇకపోతే ఎప్పట్లాగే వర్ష సూచనలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులు, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు భారత స్టాక్ మార్కెట్ల పోకడను ప్రభావితం చేస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. అయితే ఈ నెలకుగాను డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియనుండటం సూచీలను కొంత ఒడిదుడుకులకు లోను చేయవచ్చని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అంటున్నారు.
కాగా, గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 75.40 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 5.25 పాయిం ట్లు నష్టపోయినది తెలిసిందే.