బిజినెస్

అరబిందో లాభం ఆకర్షణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఔషధరంగ సంస్థ అరబిందో ఫార్మా ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 23.81 శాతం పెరిగింది. 584.96 కోట్ల రూపాయలుగా నమోదైంది. భారీగా పెరిగిన అమ్మకాలే లాభాల్లో వృద్ధికి ప్రధాన కారణం. ఇక గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో ఇది 472.45 కోట్ల రూపాయలుగా ఉంది.
ఈ మేరకు మంగళవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు అరబిందో తెలిపింది. ఏకీకృత ఆదాయం ఈసారి 3,725.90 కోట్ల రూపాయలుగా, పోయినసారి 3,298.93 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం సంస్థకు శుభారంభాన్నిచ్చిందని అరబిందో ఫార్మా ఎండి ఎన్ గోవిందరాజన్ ఆనందం వ్యక్తం చేశారు. రెండంకెల వృద్ధిని సాధించామని చెప్పారు. దీర్ఘకాల వృద్ధి కోసం సంస్థ పురోగతిపై దృష్టి పెట్టామన్నారు.