బిజినెస్

పత్తి ధరలు ఢమాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మికుంట, ఆగస్టు 23: గత రెండు నెలలుగా మురిపించిన పత్తి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. రెండు నెలల క్రితం క్వింటాల్ విడి పత్తి ధర 6,650 రూపాయల మేర పలికి క్రమంగా తగ్గుతూ వచ్చి గత శుక్రవారం నాటికి 6,100 రూపాయల వద్ద స్థిరపడింది. అయతే మంగళవారం ఒకేసారి క్వింటాల్ ధర 650 రూపాయల నుంచి 850 రూపాయల మేర పడిపోయి గరిష్ఠ ధర 5,450 రూపాయలు, కనిష్ట ధర 5,250 రూపాయలుగా నమోదైంది. కాగా, దేశీయ మార్కెట్‌లో పత్తి క్యాండీ, గింజల ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూడడంతో దాని ప్రభావం కొనుగోళ్లపై పడింది. గత శుక్రవారం నాటికి క్యాండీ ధర 50 వేల రూపాయలు పలికితే, మంగళవారం నాటికి 46 వేల రూపాయలకు దిగజారింది. అదే విధంగా పత్తి గింజల ధర 3 వేల రూపాయల నుండి 27 వందల రూపాయలకు పడి పోవడంతో కూడా పత్తి ధరలు క్షీణించాయని వ్యాపార వర్గాలు అంటున్నాయ. దీనికితోడు దేశీయ మర్కెట్లోకి ఆస్ట్రేలియా నుండి పత్తి దిగుమతి కావడం కూడ ధరల పతనానికి కారణంగా చెబుతున్నారు.