బిజినెస్

వారసుడొచ్చాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: బిలియనీర్, అడాగ్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ పెద్ద కుమారుడు జై అన్‌మోల్.. రిలయన్స్ క్యాపిటల్ బోర్డులోకి మంగళవారం అదనపు డైరెక్టర్‌గా వచ్చారు. రెండేళ్ల శిక్షణ అనంతరం 24 ఏళ్ల అన్‌మోల్ వ్యాపార అరంగేట్రం చేయగా, 2014 నుంచి వివిధ ఆర్థిక సేవల వ్యాపారాల్లో పనిచేశారు. కాగా, వచ్చే నెలలో జరిగే సాధారణ వార్షిక సమావేశంలో అన్మోల్ పూర్తిస్థాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కానున్నారు. బ్రిటన్‌లోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి డిగ్రీని అందుకున్న అన్‌మోల్.. వివిధ ప్రాంతాల్లోని సంస్థ శాఖలను సందర్శిస్తూ ఉద్యోగులతో మమేకమవుతున్నారని రిలయన్స్ క్యాపిటల్ గ్రూప్ సిఇఒ, ఇడి శ్యామ్ ఘోష్ చెప్పారు. 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కలిగి ఉన్న రిలయన్స్ క్యాపిటల్‌లో జీవిత బీమా, కమర్షియల్ ఫైనాన్స్, సెక్యూరిటీస్, జనరల్ ఫైనాన్స్, మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారాలున్నాయి. ఇక ఇప్పటికే అనీల్ అంబానీ సోదరుడు ముకేశ్ అంబానీ తన పెద్ద కుమారుడిని వ్యాపార రంగంలోకి దించినది తెలిసిందే.