బిజినెస్

స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 23: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆరంభం నుంచి నష్టాల్లో కదలాడిన సూచీలు చివర్లో కోలుకున్నాయి. ఈ క్రమంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 4.67 పాయింట్లు అందుకుని 27,990.21 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచి నిఫ్టీ 3.45 పాయింట్లు పెరిగి 8,632.60 వద్ద నిలిచింది. ఐటి, పిఎస్‌యు, బ్యాంకింగ్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కాగా, ఆసియా మార్కెట్లలో చైనా సూచీ లాభపడితే, హాంకాంగ్ సూచీ భారీగానే నష్టపోయింది. జపాన్ సూచీ కూడా నష్టాలకే పరిమితమవగా, ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు మాత్రం 0.77 శాతం వరకు పెరిగాయి.

ఎరువుల రాయితీకి డిబిటి

న్యూఢిల్లీ, ఆగస్టు 23: రైతులకే నేరుగా ఎరువుల రాయితీని అందించడంలోనూ నగదు బదిలీ పథకాన్ని (డిబిటి) అమలుపరిచేందుకు రాష్ట్రాల మద్దతును కూడగడుతోంది కేంద్ర ప్రభుత్వం. మంగళవారం ఇక్కడ జరిగిన రాష్ట్రాల వ్యవసాయ శాఖ కార్యదర్శులు, కమిషనర్ల సదస్సులో కేంద్ర ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ మాట్లాడుతూ తమ ఆలోచనకు సహకరించాల్సిందిగా కోరారు. కాగా, ఎరువుల తయారీదారులకు ఇవ్వాల్సిన 4 వేల కోట్ల రూపాయల రాయితీ బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని రాష్ట్రాలు ఈ సందర్భంగా కోరాయి.