బిజినెస్

ఏపి ప్లాంట్‌లో 50 శాతం వాటా ఉపసంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్, రిఫైనరీ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్), గ్యాస్ ఉత్పత్తిదారైన గెయిల్ ఇండియా లిమిటెడ్.. ఆంధ్రప్రదేశ్‌లోని పెట్రోకెమికల్ ప్లాంట్ నుంచి 50 శాతం వాటాను ఉపసంహరించుకోనున్నాయి. ఈ ప్రాజెక్టును 50:50 నిష్పత్తిలో ఇరు సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. అయితే 30,000 కోట్ల రూపాయల వ్యయంతో కాకినాడ వద్ద ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్‌లో 50 శాతం వాటాను వ్యూహాత్మక భాగస్వామికి ఇవ్వనున్నట్లు హెచ్‌పిసిఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ కె సురానా మంగళవారం ఇక్కడ పిటిఐకి తెలిపారు. మిలియన్ టన్నుల ఎథిలిన్ డెరివేటివ్స్ ఉత్పాదక సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్.. డిటర్జెంట్లు, రంగులు, సౌందర్య ఉత్పత్తులు, అధెసివ్స్, టెక్స్‌టైల్స్ తయారీకి కావాల్సిన వివిధ రకాల ముడి పెట్రోకెమికల్ ఉత్పత్తులను అందించనుంది.

హ్యుందాయ్ మోటార్ ఇండియా మంగళవారం న్యూఢిల్లీలో సరికొత్త
6వ తరం ఎలంత్రా సెడాన్ కారును మార్కెట్‌కు పరిచయం చేసింది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో విడుదలైన ఈ కార్ల ధరలు ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం కనిష్టంగా 12.99 లక్షల రూపాయల నుంచి
గరిష్ఠంగా 19.19 లక్షల రూపాయల మధ్య ఉన్నాయని సంస్థ తెలిపింది

న్యూఢిల్లీలో మంగళవారం నూతన 4జి స్మార్ట్ఫోన్‌ను సామ్‌సంగ్ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ‘జెడ్2’ పేరిట పరిచయమైన ఈ ఫోన్ ధర 4,590 రూపాయలు మాత్రమే. స్మార్ట్ఫోన్ల వినియోగదారులను పెంచుకోవడంలో భాగంగానే తక్కువ ధరకు 4జి శ్రేణిలో ఈ ‘జెడ్2’ను అందుబాటులోకి తీసుకురాగా, రిలయన్స్ జియో ఉచిత 4జి సేవలు దీనిలో చెల్లుబాటు అవుతాయ