బిజినెస్

మళ్లీ 28 వేల స్థాయికి సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 24: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. మంగళవారం స్వల్ప లాభాలకే పరిమితమైన నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 69.73 పాయింట్లు పుంజుకుని 28 వేల స్థాయిని మరోసారి అధిగమిస్తూ 28,108.39 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 17.70 పాయింట్లు పెరిగి 8,650.30 వద్ద నిలిచింది. నిజానికి వడ్డీరేట్లపై శుక్రవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ సమీక్ష జరపనుండటం, ఈ నెలకుగాను గురువారం డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగుస్తుండటం వంటి వాటిమధ్య మదుపరులు అమ్మకాలకు, కొనుగోళ్లకు మధ్య ఊగిసలాడారు. అయినప్పటికీ ఫార్మా, ఐటి, పిఎస్‌యు, చమురు, గ్యాస్, హెల్త్‌కేర్, విద్యుత్ రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకోవడంతో సూచీలు లాభాలను అందుకోగలిగాయి. ఇక అంతర్జాతీయంగా ఇతర ప్రధాన ఆసియా మార్కెట్లలో జపాన్ సూచీ పెరిగితే, హాంకాంగ్, చైనా సూచీలు పడిపోయాయి. ఐరోపా మార్కెట్లలోనూ ఫ్రాన్స్ లాభపడితే, జర్మనీ, బ్రిటన్ సూచీలు నష్టపోయాయి.

బస్సుల బుకింగ్ టర్నోవర్
రూ. 20 వేల కోట్లు: మోబిక్‌విక్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 24: దేశం మొత్తం మీద బస్సు సీట్ల బుకింగ్‌లో వాణిజ్యపరమైన టర్నోవర్ రూ. 20 వేల కోట్లకు చేరిందని, ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు తమ సంస్థ ప్రణాళిక ఖరారు చేసిందని మొబిక్‌విక్ ప్రకటించింది. ఆ సంస్థ కో ఫౌండర్ టి ఉపాసన మాట్లాడుతూ బస్సు టిక్కెట్ల రిజర్వేషన్‌కు పాక్షికంగా కొంత సొమ్మును చార్జ్ చేస్తామన్నారు. ప్రయాణ విధానాలను సరళీకృతం చేస్తున్నామని, తమ సంస్థ రోజూ నాలుగు వేల బుకింగ్స్‌ను నమోదు చేస్తోందన్నారు. దేశంలో ప్రైవేట్ బస్సుల ప్రయాణ మార్కెట్ సైజు రూ. 17 వేల కోట్ల రూపాయలుందన్నారు. 2018 నాటికి 40 శాతం వృద్ధి చెందుతుందని, అలాగే ప్రభుత్వరంగ బస్సుల వాణిజ్య టర్నోవర్ రూ. 44 వేల కోట్లుగా ఉందని, 2018 నాటికి 20 శాతం వృద్ధిరేటు నమోదవుతుందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 25 వేల వరకు ప్రతి రోజూ బస్సు సీట్లను బుకింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్ బుకింగ్ 15 శాతం వరకు ఉందన్నారు.
అపోలో హాస్పిటల్స్‌కు ఐసిటి అవార్డు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 24: రోగులకు వైద్య సమాచారం, టెక్నాలజీ సేవల అమలులో విశిష్ట సేవలు అందించినందుకు అపోలో హాస్పిటల్స్‌కు ప్రతిష్ఠాత్మకమైన హెచ్‌ఐఎంఎస్‌ఎస్ ఎల్‌స్లీవర్ ఐసిటి ఇన్నోవేషన్ అవార్డును ప్రకటించారు. బ్యాంకాక్‌లో జరిగిన కార్యక్రమంలో అపోలో ఆసుపత్రి సిఐఒ అరవింద్ శివరామకృష్ణన్‌కు ఐసిటి చీఫ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ఆఫీసర్ మైకేల్ ట్రోసెత్ అవార్డును ప్రదానం చేశారు. అపోలో ఆసుపత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతరెడ్డి మాట్లాడుతూ ఆసియా పసిఫిక్ జోన్‌లో 2016 సంవత్సరానికి ఈ అవార్డును తమ ఆసుపత్రి అందుకోవడాన్ని స్వాగతించారు. వైద్య సేవలకు ఆధునిక టెక్నాలజీని జోడించి మెరుగైన వైద్య సదుపాయాలను అందిస్తామన్నారు.

క్వికర్ చేతికి జాప్‌లుక్
బెంగళూరు, ఆగస్టు 24: ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ సంస్థ క్వికర్.. జాప్‌లుక్‌ను సొంతం చేసుకున్నట్లు బుధవారం తెలిపింది. బ్యూటీ, వెల్‌నెస్ సర్వీసులను డిమాండ్ ఆధారంగా జాప్‌లుక్ అందిస్తుంది. ఇప్పటికే బ్యూటీ సర్వీసెస్ విభాగంలో సలోసాను క్వికర్ చేజిక్కించుకుంది. తాజాగా జాప్‌లుక్‌ను కూడా హస్తగతం చేసుకోవడంతో డిమాండ్‌పై ఇంటివద్దే బ్యూటీ సేవలను క్వికర్ అందించనుంది. బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, చెన్నై, గుర్గావ్, హైదరాబాద్ తదితర ప్రముఖ నగరాల్లో పూర్తిస్థాయిలో క్వికర్ బ్యూటీ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.

బిఎస్‌ఎన్‌ఎల్ అపరిమిత 3జి ప్లాన్
న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్.. తమ ప్రత్యర్థి సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని ఎదుర్కోవడంలో భాగంగా బుధవారం ఓ అపరిమిత 3జి ప్లాన్‌ను పరిచయం చేసింది. 1,099 రూపాయలకు లభించే ఈ ప్లాన్‌లో ప్రస్తుత ఇతర ప్లాన్‌లతో పోల్చితే వినియోగదారులకు రెట్టింపు స్థాయిలో డేటా వస్తుంది. బిఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి ఈ ప్లాన్ దోహదపడగలదన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా సంస్థ సిఎండి అనుపమ్ శ్రీవాత్సవ వ్యక్తం చేశారు. అలాగే కొత్త ప్లాన్‌లో ఇంటర్నెట్ వేగం ఏమాత్రం తగ్గదని స్పష్టం చేశారు.

భారత్-సైప్రస్ డిటిఎఎ సవరణకు
కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ, ఆగస్టు 24: పన్ను ఎగవేతలపై పోరులో భాగంగా భారత్ మరో ముందడుగు వేసింది. ఇండియా-సైప్రస్ మధ్య ఉన్న ద్వంద్వ పన్నుల నిరోధక ఒప్పందం (డిటిఎఎ) సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్.. భారత్-సైప్రస్ డిటిఎఎ సవరణకు ఆమోదం తెలిపింది.’ అని అధికారిక ప్రకటన ఒకటి బుధవారం తెలిపింది. ఇప్పటికే మారిషస్‌తో ఉన్న డిటిఎఎలోనూ భారత్ సవరణలు చేసినది తెలిసిందే. కాగా, నివాసం ఆధారంగా కాకుండా షేర్ల బదిలీపై లాభాల ఆధారంగా పన్నులను వేయాలని సైప్రస్‌తో కుదుర్చుకున్న డిటిఎఎలో మార్పులు చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మార్పులు అమల్లోకి వస్తాయి.