బిజినెస్

బలార్షా-కాజీపేట మూడోలైనుకు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: రైల్వే శాఖ 2,403 కోట్ల రూపాయల వ్యయంతో బలార్షా నుంచి కాజీపేట వరకు మూడో రైల్వే లైనును నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆర్థిక వ్యవహారాల ఉపసంఘం సమావేశంలో ఈ పథకానికి ఆమోద ముద్ర వేసింది.
బలార్షా-కాజీపేట మధ్య మూడో రైల్వే లైను నిర్మాణం పనులను ప్రారంభించే సమయంలో దీని వ్యయం 2,065 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా వేస్తున్నా.. నిర్మాణం పూర్తయ్యేసరికి మొత్తం వ్యయం 2,403.22 కోట్ల రూపాయలకు చేరుతుందని ఓ అధికార ప్రకటనలో వెల్లడించారు. 201 కిలోమీటర్ల పొడవుండే ఈ లైను నిర్మాణం పనులు ఐదు సంవత్సరాల్లో పూర్తవుతుతాయని అంచనా వేస్తున్నారు.
ఈ లైను నిర్మాణం వల్ల ప్రయాణం మరింత సులభతరం కావటంతోపాటు విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణా, సిమెంట్ రవాణా పెరుగుతుంది. దీంతోపాటు తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి మహారాష్టల్రోని చంద్రపూర్ జిల్లాకు రైల్వే సౌకర్యం ఏర్పడుతుంది. బలార్షా-కాజీపేట మూడో లైను కొత్త ఢిల్లీ-చెన్నై ట్రంక్ రూట్‌లో భాగం కావటంతోపాటు గోల్డెన్ ట్రయాంగిల్ రూట్‌లో భాగం అవుతుంది. ప్రస్తుతం బలార్షా-కాజీపేట మధ్య ఉన్న రైల్వే లైన్ల సామర్థ్య ఉపయోగం 127 శాతానికి చేరింది. దీంతోపాటు ఈ ప్రాంతంలో జమ్మికుంట కేశోరాం సిమెంట్, థర్మల్ పవర్ స్టేషన్, ఎస్‌సిసిఎల్ సైడింగ్, రెచ్ని రోడ్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో బొగ్గు సైడింగ్, ఘట్‌చందూర్, మణికఘర్‌లో సిమెంట్ లోడింగ్ పాయింట్లు ఉన్నాయి. సరుకు రవాణాకు ఈ లైను ఎంతో ముఖ్యమైంది కాబట్టే మూడో లైను నిర్మాణం చేపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఆ ప్రకటనలో వివరించింది.