బిజినెస్

ఏపి జెన్కోలో ఈ-ఆఫీసు కార్యకలాపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: ఏపి జెన్కోలో దశలవారీగా ఈ-ఆఫీసు కార్యకలాపాలను ప్రవేశపెడుతున్నామని, దేశం మొత్తం మీద ఈ టెక్నాలజీని అమలు చేసిన తొలి విద్యుత్ సంస్థ ఏపి జెన్కోనే అని ఆ సంస్థ సిఎండి కె విజయానంద్ అన్నారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ సహకారంతో ఏపి ట్రాన్స్‌కోలో ఏర్పాటు చేసిన ఈ-ఆఫీసు కార్యకలాపాలను శుక్రవారం ఇక్కడ విద్యుత్ సౌధ సమావేశ మందిరంలో ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనుబంధంగా ఉన్న ఎన్‌ఐసి వారి సహకారంతో ట్రాన్స్‌కోలోని ఐటి విభాగం ఈ-ఆఫీసును ఏర్పాటు చేశారన్నారు. ఈపిడిసిఎల్ పరిధిలో ఇప్పటికే ఈ-ఆఫీసును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏపి జెన్కోలో కూడా ఈ-ఆఫీసు నిర్వహణ పనులు తుదిదశకు చేరుకున్నాయని, ఈ అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. కాగిత రహిత దస్త్ర పరిశీలన వల్ల విద్యుత్ ఫైళ్ల పరిష్కారం వేగవంతమవుతుందని అభిప్రాయపడ్డారు. పేపర్ వేస్టేజి తగ్గుతుందని తెలిపారు. పనులు సులువుగా సజావుగా త్వరితగతిన పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలను తాము అమలు చేస్తున్నామన్నారు. ఏపి ట్రాన్స్‌కో జెఎండి దినేష్ పరుచూరి మాట్లాడుతూ ప్రస్తుతం 30 యూజర్ ఐడిలను కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపి ట్రాన్స్‌కో టెలికామ్ సిఇ రఘుపతి, అదనపు కార్యదర్శి సూర్యకళ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సౌధ సమావేశ మందిరంలో విజయానంద్

కొలిక్కివచ్చిన రాజమండ్రి
పేపర్‌మిల్లు సంక్షోభం
బేషరతుగా విధుల్లోకి కార్మికులు ౄ పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 2: రాజమండ్రిలోని ఇంటర్నేషనల్ పేపర్ మిల్స్ పరిశ్రమలో తలెత్తిన వివాదం శాంతియుతంగా పరిష్కారమైంది. ఇంతవరకు ఆందోళన జరిపిన కార్మికులు.. చర్చల అనంతరం బేషరతుగా విధుల్లోకి వెళ్ళడంతో యథాతథ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో 21రోజుల తర్వాత పేపరు మిల్లు పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేరింది.
కార్మికులకు, యాజమాన్యానికి మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో థర్డ్ పార్టీ విచారణ అనంతరం చర్యలు తీసుకునే విధంగా అంగీకారం కుదిరింది. దీంతో కార్మికులు గురువారం విధుల్లోకి చేరారు. అయతే ఆందోళన చేసిన 21రోజుల జీతాన్ని మాత్రం కార్మికులు నష్టపోయారు. కాగా, కార్మికులు, కార్మిక శాఖ అధికారులు, యాజమాన్యంతో రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారు.