బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 7: మంగళవారం భారీ లాభాలను అందుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. బుధవారం నష్టాల్లోకి జారుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 51.66 పాయింట్లు పడిపోయి 28,926.36 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 25.05 పాయింట్లు దిగజారి 8,917.95 వద్ద నిలిచింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సమావేశానికి ముందు మదుపరులు లాభాల స్వీకరణకు దిగగా, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ పరిస్థితులూ ఇందుకు దోహదపడ్డాయి. ఇక కన్జ్యూమర్ డ్యూరబుల్స్, యుటిలిటిస్, చమురు, గ్యాస్, ఫైనాన్స్, టెక్నాలజీ రంగాల షేర్ల విలువ 0.96 శాతం నుంచి 0.13 శాతం క్షీణించింది. అయితే క్యాపిటల్ గూడ్స్, మెటల్, రియల్టీ, విద్యుత్ రంగాల షేర్ల విలువ 1.21 శాతం నుంచి 0.66 శాతం పెరిగింది. ఆసియా మార్కెట్లలో చైనా, తైవాన్ సూచీలు 0.84 శాతం వరకు లాభపడితే, హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా సూచీలు 0.10 శాతం నుంచి 0.41 శాతం వరకు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలోనూ ఫ్రాన్స్, జర్మనీ సూచీలు 0.22 శాతం, 0.31 శాతం చొప్పున పెరగగా, బ్రిటన్ సూచీ మాత్రం 0.01 శాతం పడిపోయింది.

మైక్రోఫైనాన్స్ రంగంలో
దక్షిణాది సంస్థల హవా

హైదరాబాద్, సెప్టెంబర్ 7: మైక్రోఫైనాన్స్ రంగంలో దేశంలోని దక్షిణాది రాష్ట్రాల సంస్థలదే హవా. మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ నెట్‌వర్క్ (ఎమ్‌ఎఫ్‌ఐఎన్) నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశీయ మైక్రోఫైనాన్స్ సంస్థలు రుణాల పంపిణీలో 29 శాతం వృద్ధిరేటును సాధించాయి. అయితే ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సంస్థలు 35 శాతం వృద్ధిని నమోదు చేసి అగ్రస్థానంలో ఉన్నాయని ఎమ్‌ఎఫ్‌ఐఎన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రత్న విశ్వనాథన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇక ఉత్తరాది రాష్ట్రాల వాటా 25 శాతంగా, పశ్చిమాది రాష్ట్రాలు 24 శాతం. తూర్పు భారతదేశ రాష్ట్రాల సంస్థలు 16 శాతం వృద్ధిని అందుకున్నాయన్నారు. కాగా, దక్షిణాది రాష్ట్రాల్లో రుణ పంపిణీలో తమిళనాడు, కర్నాటక టాప్-5లో ఉన్నాయ.