బిజినెస్

వాణిజ్య సంబంధాలకు విఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: వీసా ఫీజును పెంచాలన్న అమెరికా నిర్ణయం వివక్షాపూరితమైనదని భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (్ఫక్కీ) ఆవేదన వ్యక్తం చేసింది. వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు భారత్, అమెరికా చేస్తున్న ప్రయత్నాలపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపుతుందని ఫిక్కీ స్పష్టం చేసింది. ఇటువంటి చట్టం వలన భారత ఐటి సంస్థల నుంచి వస్తున్న పన్ను రాబడులు భారీగా తగ్గి అమెరికా ఆర్థికేతర, ఆర్థిక వ్యవస్థల అభివృద్ధికి కూడా నష్టం కలిగిస్తుందని ఫిక్కీ ప్రకటనలో తెలిపింది. ‘హెచ్-1బి, ఎల్-1 వంటి ప్రముఖ వీసాల ప్రత్యేక ఫీజులను పెంచడం వివక్షాపూరితమైన చర్య. దీనివలన భారత సంస్థలకు, ముఖ్యంగా ఐటి సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు అమెరికా ఆర్థికేతర, ఆర్థిక వ్యవస్థల అభివృద్ధికీ విఘాతం కలుగుతుంది’ అని ఫిక్కీ పేర్కొంది.