బిజినెస్

30 నెలల గరిష్ఠానికి బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: బంగారం, వెండి ధరలు పరుగులు పెట్టాయి. బుధవారం బులియన్ మార్కెట్‌లో రెండున్నరేళ్ల గరిష్ఠానికి పసిడి ధరలు చేరాయి. ఈ ఒక్కరోజే 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పుత్తడి ధర 450 రూపాయలు పెరిగి 31,550 రూపాయల వద్ద స్థిరపడింది. 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర 31,400 రూపాయలు పలికింది. ఫలితంగా 2014 ఫిబ్రవరి 26 నాటి స్థాయికి ధరలు చేరాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాల మధ్య దేశీయ మార్కెట్‌లో నెలకొన్న డిమాండ్‌ను అందుకోవడానికి ఆభరణాల వర్తకులు పసిడి కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు. విదేశీ విపణిలోనూ ధరలు పుంజుకున్నాయి. సింగపూర్ మార్కెట్‌లో బుధవారం ఔన్సు పుత్తడి ధర 0.2 శాతం పెరిగి 1,352.16 డాలర్లుగా నమోదైంది. మంగళవారమైతే 1.7 శాతం ఎగబాకింది. ఇక వెండి విషయానికొస్తే కిలో ధర ఏకంగా 750 రూపాయలు ఎగిసి 46,950 రూపాయలకు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ కనిపించింది.