బిజినెస్

సందిగ్ధంలో యాదాద్రి పవర్ ప్లాంట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 19: తెలంగాణ వెలుగుదివ్వెగా ప్రచారం పొందిన నల్లగొండ జిల్లా పరిధిలోని దామరచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం మరోసారి సందిగ్ధంలో పడింది. తెలంగాణలోని భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌కు ఎట్టకేలకు అనుమతినిచ్చిన కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ (ఈఏసి) మరోసారి 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు మాత్రం మొండిచేయి చూపింది. తాజాగా తెలంగాణ జెన్‌కో సమర్పించిన పర్యావరణ అనుమతి నివేదికను ఈఏసి తిరస్కరించి 16 అంశాలపై మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేసి కొత్తగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అసలే ప్రపంచ దేశాలు బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను తగ్గించాలని నిర్ణయంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా ఈ దిశగా ఇప్పటికే అడుగులేస్తోంది. ఈ క్రమంలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ అనుమతులు సందిగ్ధంలో పడడం ఒక భాగమైతే అనుమతుల కోసం జెన్‌కో సమర్పించిన 650 పేజీల పర్యావరణ అనుమతి నివేదిక (డిపిఆర్) సైతం లోపభూయిష్టంగా ఉండడం మరో సమస్యగా తయారైంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ కన్సల్టెంట్ సంస్థతో తయారుచేసిన పర్యావరణ అనుమతుల నివేదిక డిపిఆర్‌ను జెన్‌కో ఈఏసికి సమర్పించింది. అయితే 2014లో మరో థర్మల్ ప్లాంట్ సమర్పించిన డిపిఆర్‌ను యాదాద్రి డిపిఆర్ పోలిఉండడాన్ని గ్రహించిన ఈఏసి సభ్యులు సదరు నివేదికను తిరస్కరించారు. ఈ డిపిఆర్‌పై 16 అభ్యంతరాలు లేవనెత్తి వాటిపై మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేసి మళ్లీ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అయితే ఈఏసి లేవెనెత్తిన అభ్యంతరాలు కఠినంగా ఉండడంతో దీనిపై పర్యావరణ అనుమతులు పొందడం జెన్‌కోకు కష్టసాధ్యమేనని తెలుస్తోంది. యాదాద్రి ప్లాంట్‌తో ఎదురయ్యే పర్యావరణ సమస్యలపై మళ్లీ ఆధ్యయనం చేసి సమగ్ర నివేదిక అందించాలని సూచించింది. సదరు నివేదికపై ప్రజలు తమ అభిప్రాయలను 15 రోజుల్లోగా నేరుగా జెన్‌కోకు లేదా కేంద్రా పర్యావరణ మంత్రిత్వ శాఖకు తెలిపేలా మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో, గ్రామపంచాయతీల్లో ఉంచాలని నిర్ధేశించింది. యాదాద్రి ప్లాంట్ నుండి వెలువడే బూడిద నిల్వ, రవాణా, వాటిపై జాగ్రత్తల చర్యలు సరిగా లేవని, బొగ్గు దిగుమతులు ఎక్కడి నుండి తెస్తారన్న దానిపై, రైల్వే వసతులపై, బొగ్గు కొనుగోలు, నీటి లభ్యత, సమీప నదులు, వాగుల కలుషిత నివారణల చర్యలపై, గ్రీన్‌బెల్ట్ ఏర్పాటుపై జెన్‌కో సమర్పించిన వివరాలు అస్పష్టంగా ఉన్నాయంటు నిపుణుల కమిటీ అభ్యంతరాలు తెలిపింది. మరోవైపు తెలంగాణ విద్యుత్ జెఎసి కూడా యాదాద్రి థర్మల్ ప్లాంట్ రాష్ట్రానికి గుదిబండయని దీని నిర్మాణంతో ఏటా 3 వేల కోట్ల భారం పడుతుందంటూ అభ్యంతరం లేవనెత్తింది.
ఆది నుండీ అభ్యంతరాలే!
తెలంగాణ వెలుగు దివ్వెగా యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ను అభివర్ణిస్తూ 2015 జూన్ 8వ తేదీన సిఎం కెసిఆర్ ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా నిర్మించాల్సిన యాదాద్రి ప్లాంట్‌కు కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ఆది నుండి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తునే ఉంది. ఇప్పటిదాకా నాలుగుసార్లు దీనిపై సమావేశమైన ఈఏసి ప్రతిసారి పర్యావరణ అనుమతులకు జెన్‌కో సమర్పించిన నివేదికను తిరస్కరించడం గమనార్హం. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ యాదాద్రికి ఒకవైపు మోకాలడ్డుతుండగా మరోవైపు 2015 ఆగస్టులోనే కేంద్ర అటవీ శాఖ మాత్రం ప్రత్యామ్నాయ భూముల్లో అటవీ అభివృద్ధి చేయాలన్న షరతులతో యాదాద్రి ప్లాంట్ నిర్మాణం కోసం జెన్‌కో కోరిన 1892 హెక్టార్ల అటవీ భూములను బదలాయించింది. ఇప్పటికే 4,212 ఎకరాల ప్రభుత్వ, వివిధ రకాల పట్టా భూములను సేకరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి 2015 డిసెంబర్ 5న కేంద్ర పర్యావరణ నిపుణుల ముగ్గురు సభ్యుల కమిటీ యాదాద్రి ప్లాంట్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. పరిసరాల్లోని కృష్ణా, మూసీ, తంగపాడుబంధం వాగు, అన్నమేరువాగులను పరిశీలించి అవి కలుషితం కాకుండా చూసే చర్యలపై జెన్‌కో అభిప్రాయాలను, ఈ ప్రాంత ప్రజలు, రైతుల అభిప్రాయలను తెలుసుకున్నారు. ఈ ఏడాది మే 30న యాదాద్రి థర్మల్ ప్లాంట్ వద్ద కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లా ప్రజాప్రతినిధుల చొరవతో ప్లాంట్‌కు అనుకూలంగా నివేదించారు. ఇంతచేసినా ఇప్పుడు ఈఏసి మళ్లీ 16 అభ్యంతరాలతో అనుమతులను నిరాకరించి మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ కోరడంతో అసలు అనుమతులు వస్తాయో రావో వస్తే ఎప్పటికి వస్తాయోనన్న సందిగ్ధత నెలకొంది.