బిజినెస్

భారత్, వర్థమాన దేశాల్లో క్రమంగా వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: భారత్‌తో సహా పలు అభివృద్ధి చెందుతున్న దేశాలు క్రమంగా రికవరీ వైపు మారుతున్నందున ఈ ఏడాది ఉన్న 4 శాతంగా ఉన్న వర్థమాన దేశాల మార్కెట్ వృద్ధి 2017లో 4.7 శాతానికి మెరుగుపడుతుందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఒక నివేదికలో పేర్కొంది. మొత్తంమీద అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ స్తబ్దుగానే కొనసాగనున్నప్పటికీ కొన్ని దేశాలు మాత్రం అభివృద్ధి పథంలో సాగనున్నాయని మోర్గాన్ స్టాన్లీ ఇనె్వస్టమెంట్ మేనేజిమెంట్ తన నివేదికలో అభిప్రాయ పడింది. భారత్, ఇండోనేసియా వృద్ధి నిలకడగా కొనసాగడమో లేదా ఇప్పుడున్న స్థాయి నుంచి మెరుగుపడ్డమో జరుగుతుందని, అదే సమయంలో చైనా, కొరియాలలో వృద్ధి వేగం మందగించవచ్చని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. భారత్, ఇండోనేసియా దేశాల్లో స్థూల స్థిరత్వ రిస్క్‌లు తక్కువగా ఉన్నాయని, అయితే చైనా, కొరియా దేశాల్లో మాత్రం జిడిపితో పోలిస్తే అప్పులు పెరగవచ్చని పేర్కొంది. భారత్ విషయానికి వస్తే ప్రైవేట్ పెట్టుబడుల వృద్ధి రెండో త్రైమాసికంలో సైతం బలహీనంగానే కొనసాగవచ్చని, అయితే రికవరీ ధోరణి మరింత విస్తృతం కానుందని ఆ నివేదిక తెలిపింది. అంతేకాకుండా ప్రైవేట్ వినియోగం, ప్రభుత్వ పెట్టుబడులు,ఎఫ్‌ఢిఐలతో పాటుగా ఎగుమతుల వృద్ధి సైతం మెరుగుపడుతోందని పేర్కొంది.
‘ఏకర్’లో పూర్తివాటా ‘యాక్సిస్’కు
రూ.22.72 కోట్లకు ఒప్పందం : ఐఎఫ్‌సిఐ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ఎసెట్స్ కేర్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఎంటర్‌ప్రైజ్ (ఏకర్) లిమిటెడ్‌లో తనకు గల మొత్తం 13 శాతం వాటాను రూ.22.72 కోట్ల మొత్తానికి యాక్సిస్ బ్యాంకుకు అమ్మేయనున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థ ఐఎఫ్‌సిఐ వెల్లడించింది. ఇందుకు సంబంధించి యాక్సిస్ బ్యాంకుతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజికి ఐఎఫ్‌సిఐ తెలియజేసింది. ఏకర్ లిమిటెడ్ నుంచి తమ పెట్టుబడులను పూర్తిగా ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఐఎఫ్‌సిఐ ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించింది.