బిజినెస్

కాలుష్యాన్ని తొలగించేందుకు ఆధునిక యంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 27: విద్యుత్ సబ్‌స్టేషన్లలో పింగాణి, ఇన్సులేటర్లపై పేరుకుపోయే దుమ్ము, ధూళి వంటి కాలుష్యాన్ని తొలగించి విద్యుత్ సరఫరాల్లో అంతరాయాలు, సాంకేతికపరమైన సమస్యలు అధిగమించేందుకు వీలుగా ఎపి ట్రాన్స్‌కో హాట్‌లైన్ వాషింగ్ మిషన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దేశంలో ఒక్క ముంబయిలోనే తయారయ్యే ఈ యంత్రాన్ని రూ.45 లక్షలు వెచ్చించి ఎపి ట్రాన్స్‌కో కొనుగోలు చేయడానికి టెండర్లు ఖరారయ్యాయి. త్వరలో ఇది ఇక్కడకు వచ్చేందుకు అవసరమైన చర్యలు ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు చేపట్టారు. ఇది అందుబాటులోకి వస్తే విద్యుత్ అంతరాయాలు, లోవోల్టేజీ, సబ్‌స్టేషన్లలో విద్యుత్ పరికరాలు పేలిపోయి మంటలు సంభవించడం వంటి సాంకేతికపరమైన సమస్యలుండవు. సముద్రతీర ప్రాంతంలో ఉండే 220కెవి, 400 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్లలో పింగాణి పరికరాలు, ఇన్సులేటర్లు వంటి పరికరాలు తుక్కు పడుతుంటాయి. అలాగే పరిశ్రమలు విడిచిపెట్టే కాలుష్యం వీటిపై పేరుకుపోతుంటుంది. దీనివల్ల తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం, ట్రిప్ కావడం, సరిచేయడానికి గంటలు, రోజులు తరబడి సమయం పడుతుంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్రాన్స్‌కోకు చెందిన సబ్‌స్టేషన్లలో కాలుష్యం పేరుకుపోయి నెలకొన్న సాంకేతిక సమస్యతో ఏకంగా నాలుగు రోజులపాటు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 30 లక్షల మంది వినయోగదారులు ఇబ్బందులు పడ్డారు. నాలుగు రోజులపాటు అనేకసార్లు సరఫరా నిలిచిపోయిన సంఘటన వేసవి సీజన్‌లోనే తలెత్తింది. ఇటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకున్న ఎపి ట్రాన్స్‌కో భవిష్యత్‌లో సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ముంబయిలో ఓ ప్రైవేటు సంస్థ తయారు చేసే అత్యాధునిక హాట్‌లైన్ వాషింగ్ మిషన్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీంతో సబ్‌స్టేషన్లలో విద్యుత్ పరికరాలపై పేరుకుపోయే కాలుష్యాన్ని సులభంగా తొలగించవచ్చని ట్రాన్స్‌కో సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్టమోహన్ ‘ఆంధ్రభూమి’కి మంగళవారం తెలిపారు. నవంబర్, డిసెంబర్‌ల్లో ఈ యంత్రంతో శుభ్రపర్చే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో అరుదుగా ఇటువంటి యంత్రాన్ని ఉపయోగించడం ద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయాలను అధిగమిస్తున్నారన్నారు. తొలిసారిగా విశాఖలోనే దీనిని వినియోగిస్తామన్నారు. విద్యుత్ సరఫరాను నిలిపివేయకుండానే హాట్‌లైన్ వాషింగ్ మిషన్‌ను ఉపయోగించే ప్రత్యేక సౌలభ్యం ఉందన్నారు. విద్యుత్ పరికరాలకు ఉప్పు, తుప్పు వంటివి పట్టకుండా తాత్కాలిక పరిష్కారంలో భాగంగా ఇన్సులేటర్లు, పింగాణి పరికరాలపై సిలికాన్ పెయింట్ వేసే కార్యక్రమాన్ని పూర్తిచేశామన్నారు.