బిజినెస్

మూడో రోజూ నష్టాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 27: దేశీయ స్టాక్ మార్కెట్లు వరసగా మూడో సెషన్‌లో కూడా నష్టాలతో ముగిశాయి. ప్రధాన సూచీలు ప్రారంభంలో లాభాలల్లో సాగినప్పటికీ ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. ఐరోపా మార్కెట్లలో బలహీన ధోరణుల ప్రభావంతో సెనె్సక్స్ దాదాపు 71 పాయింట్లు నష్టపోయి దాదాపు నెలరోజుల కనిష్టస్థాయి అయిన 28,224 పాయింట్ల వద్దకు చేరుకోగా, జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 16.55 పాయింట్లు నష్టపోయి 8,706.40 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య చర్చలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఆధిక్యత సాధించడంపై మార్కెట్లు సైతం సానుకూలంగా స్పందించాయి. ఫలితంగా క్రితం వారం ముగింపుకన్నా పై స్థాయిలో ప్రారంభమైన సెనె్సక్స్ మధ్యాహ్నం దాకా లాభాలతోనే సాగింది. అయితే ఆ తర్వాత ఐరోపా మార్కెట్లు బలహీనంగా ప్రారంభమవడంతో దాని ప్రభావం దేశీయ సూచీలపై కూడా కనిపించింది. మరోవైపు ఫ్యూచర్స్, ఆప్షన్ల గడువు ముగియడానికి మరో రోజు మాత్రమే మిగిలి ఉండడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపించింది. ఫలితంగా సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 18 షేర్లు నష్టాలు చవి చూశాయి. అదానీ పోర్ట్స్ షేర్లు 2.20 శాతం మేర పడిపోగా, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు సైతం 2.01 శాతం మేర పడిపోయాయి. ఎల్‌అండ్‌టి, ఓఎన్‌జిసి, యాక్సిస్ బ్యాంక్, గెయిల్, ఎస్‌బిఐ లాంటి ప్రధాన షేర్లు కూడా బాగానే నష్టపోయాయి. అయితే ఐటి, హెల్త్‌కేర్, టెక్నాలజీ, వినియోగవస్తువులకు సంబంధించిన షేర్లు మార్కెట్ పతనాన్ని కొంతమేరకు ఆదుకున్నాయి. ప్రధాన షేర్లు నష్టపోయిన నేపథ్యంలో చిన్న, మధ్య తరహా షేర్లు లాభపడ్డాయి.
21 సంస్థల ట్రేడింగ్‌ను నిలిపివేయనున్న బిఎస్‌ఇ
ఇదిలా ఉండగా లిస్టింగ్ నిబంధనలను పాటించనందుకు బిఎస్‌ఇ వచ్చే నెల 18వ తేదీ నుంచి 21 కంపెనీల షేర్ల ట్రేడింగ్‌ను నిలిపివేయనుంది. అయితే ఒక వేళ ఈ కంపెనీలు అక్టోబర్ 10 నాటికి నిబంధనలను పాటించినట్లయితే వాటిపై వేటు పడదు. సస్పెన్షన్ వేటు పడనున్న కంపెనీల్లో ఆర్య గ్లోబల్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్, భాగ్యోదయ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, కైరా లాండ్‌స్కేప్స్, లోక్ హౌసింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్స్, లుమాక్స్ ఆటోమోటివ్ సిస్టమ్స్, మాగ్నా ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్‌పోర్ట్స్, రాజధాని లీజింగ్ అండ్ ఇండస్ట్రీస్, రత్నమణి ఆగ్రో ఇండస్ట్రీస్, ఆర్‌ఎన్‌బి ఇండస్ట్రీస్, శ్రీస్టర్ సిలికేట్స్, సూర్యజ్యోతి స్పిన్నింగ్ మిల్స్‌లాంటివి ఉన్నాయి. అంతేకాదు, తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ కంపెనీల్లో ప్రమోటర్ల వాటాలను స్తంభింపజేయాలని కూడా బిఎస్‌ఇ ఆదేశించింది.