బిజినెస్

నష్టాలకు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 28: వరసగా మూడు రోజులు నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు బుధవారం ఓ మోస్తరు లాభాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లలో సానుకూల సంకేతాల కారణంగా రియల్టీ, బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్లు రాణించడంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ 69 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ సైతం దాదాపు 39 పాయింట్లు లాభపడింది. సెప్టెంబర్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్ట్‌ల గడువు గురువారంతో ముగియనున్న నేపథ్యంలో ఇనె్వస్టర్లు షార్ట్ కవరింగ్‌కు దిగడం కూడా స్టాక్ మార్కెట్లు కోలుకోవడానికి దోహదపడింది. అయితే వచ్చేవారం జరగనున్న ఆర్‌బిఐ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం కోసం దేశీయ మదుపరులతో పాటుగా విదేశీ ఇనె్వస్టర్లు సైతం ఆదుర్దాగా ఎదురు చూస్తుండడంతో మార్కెట్లలో ఓ రకమైన జాగ్రత్త వాతావరణం నెలకొని ఉంది. ఆర్‌బిఐ కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన జరుగుతున్న తొలి సమావేశమే కాక ఆరుగురు సభ్యుల కమిటీ తొలిసారిగా వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనుండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత లభించింది.
బుధవారం ఉదయం 28,198.88 పాయింట్ల వద్ద స్తబ్దుగా మొదలైన తర్వాత సెనె్సక్స్ కొద్దిసేపటికే లాభాల బాటలో సాగి ఒక దశలో 28,376.56 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. అయితే చివరికి 69.11 పాయింట్ల లాభంతో 28,292.81 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 38.75 పాయింట్ల లాభంతో 8,745.15 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు సెషన్లలో సెనె్సక్స్ దాదాపు 550 పాయింట్లు నష్టపోయిన విషయం తెలిసిందే. సెనె్సక్స్‌లోని షేర్లలో టాటా స్టీల్ షేరు గరిష్ఠంగా 3.25 శాతం లాభపడగా, భారతీ ఎయిర్‌టెల్ 2.42 శాతం లాభపడింది. అదానీ పోర్ట్స్, ఎస్‌బిఐ, ఒఎన్‌జిసి, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎల్‌అండ్‌టి, పవర్‌గ్రిడ్, మహింద్ర, మహింద్ర, ఐటిసి, డాక్టర్ రెడ్డీస్, గెయిల్, హెచ్‌డిఎఫ్‌సి, ఎన్‌టిపిసిలాంటి ప్రధాన షేర్లు కూడా మంచి లాభాలనే ఆర్జించాయి. సెనె్సక్స్‌లోని మొత్తం 30 షేర్లలో 19 షేర్లు లాభపడ్డాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, సన్‌ఫార్మా, సిప్లా, టిసిఎస్, హీరోమోటోకార్ప్, విప్రో, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోగా, ఐసిఐసిఐ బ్యాంక్ షేరు మార్పు లేకుండా నిలిచింది. కాగా, టైర్ల తయారీ సంస్థ ఎంఆర్‌ఎఫ్ షేరు ఒక దశలో తొలిసారి 50 వేల రూపాయలను దాటింది. అయితే చివరికి 6.73 శాతం పెరిగి రూ. 49,734.45 ముగిసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల మధ్య చర్చలో రిపబ్లికన్ పార్టీ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై చేయి సాధించడంతోపాటు అంచనాలకన్నా మెరుగయిన పలు ఆర్థిక నివేదికల కారణంగా మంగళవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు కూడా లాభాల బాటలో సాగాయి. అయితే ప్రధాన ఆసియా మార్కెట్ల సూచీలు మాత్రం నష్టాలతో ముగిశాయి.
కాగా, కమోడిటీ డెరివేటివ్ మార్కెట్‌కు మరింత ఊతమిచ్చేందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చర్యలు తీసుకుంది. కమోడిటీ ఆఫ్షన్స్ ట్రేడింగ్‌కు అనుమతి ఇవ్వడంతో పాటుగా కొత్తగా ఆరు సరకులను కమోడిటీస్ జాబితాలో చేర్చింది. కొత్తగా చేర్చిన వాటిలో వజ్రాలు, తేయాకు, గుడ్లు, కోకో, దుక్క ఇనుము, ఇత్తడి ఉన్నాయి. దీంతో ఈ జాబితాలో మొత్తం సరకుల సంఖ్య 91కి చేరుకుంది.