బిజినెస్

స్టాక్ మార్కెట్‌లో ఊగిసలాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 30: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అయితే గురువారం వాటిల్లిన భారీ నష్టాల నేపథ్యంలో చివరకు స్వల్ప లాభాలను అందుకోగలిగాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 38.43 పాయింట్ల లాభంతో 27,865.96 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 19.90 పాయింట్లు పెరిగి 8,611.15 వద్ద నిలిచింది. గురువారం సెనె్సక్స్ 465, నిఫ్టీ 154 పాయింట్లు పతనమైనది తెలిసిందే. ఇక ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 802.26 పాయింట్లు క్షీణిస్తే, నిఫ్టీ 220.40 పాయింట్లు పడిపోయింది.
నిర్మాణం, చమురు, గ్యాస్, వౌలిక, ఆటో రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. 3.16 శాతం నుంచి 1.34 శాతం మేర విలువను కోల్పోయాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే ఆసియా మార్కెట్లలో ప్రధానమైన హాంకాంగ్, జపాన్ సూచీలు నష్టపోతే, చైనా సూచీ లాభపడింది. ఐరోపా మార్కెట్లలోనూ కీలకమైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు నష్టపోయాయి.
రూ. 400 కోట్ల ఆదాయం
ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ కాపర్‌లో వాటా విక్రయం ద్వారా శుక్రవారం సర్కారుకు 400 కోట్ల రూపాయల నిధులు అందాయి. రిటైల్ మదుపరుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కరువైనప్పటికీ, సంస్థాగత మదుపరుల నుంచి భారీగా బిడ్లు దాఖలవడంతో లక్ష్యానికి తగ్గట్లుగా నిధుల సమీకరణ సాధ్యమైంది. హిందుస్థాన్ కాపర్‌లో 7 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి తెచ్చింది. ఒక్కో షేర్ ధర 62 రూపాయలు.
సెబీ అప్రమత్తం
భారత సైన్యం సర్జికల్ దాడుల నేపథ్యంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అప్రమత్తమైంది. స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవకుండా తగిన చర్యలు చేపడుతోంది. నియంత్రణ రేఖ వెంబడిగల పాక్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలపై సైన్యం చేసిన దాడుల మధ్య గురువారం భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలకు లోనైనది తెలిసిందే.
ఈ క్రమంలో మదుపరులు పెట్టుబడులపై విశ్వాసం కోల్పోకుండా సెబీ జాగ్రత్తలు తీసుకుంటోంది. మరోవైపు మనీలాండరింగ్, పన్ను ఎగవేత కేసులో 20 సంస్థలపై నిషేధాన్ని సెబీ ధ్రువీకరించింది.