బిజినెస్

బిల్డర్ల ఆగడాలకు అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 2: నగరాలు, పట్టణాల్లో సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునేవారు ప్రస్తుత పరిస్థితుల్లో బహుళ అంతస్తుల భవనాలను (అపార్ట్‌మెంట్స్) ఆశ్రయించక తప్పడంలేదు. ప్రభుత్వ ఉద్యోగుల నుండి ఉన్నత, మధ్య తరగతి వర్గాలు సైతం అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్ల కొనుగోలుకు ముందుకువస్తున్నారు. దీంతో ఆయా వర్గాల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న బిల్డర్లు తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. అపార్ట్‌మెంట్ల ధరలను అమాంతం పెంచేయడం ఓ ఎత్తయితే, ఫ్లాట్లను విక్రయించిన తరువాత కూడా యజమానులపై తమ పెత్తనాన్ని చెలాయస్తుండటం మరో ఎత్తు. ఇటువంటి పరిస్థితుల్లో బిల్డర్ల ఆగడాలకు కళ్ళెం వేయడానికి కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలను పటిష్ఠంగా అమలు చేయనుంది. కేంద్ర రియల్ ఎస్టేట్ నియంత్రణ, అభివృద్ధి చట్టం-2016 ద్వారా దేశమంతా ఒకే విధంగా నిబంధనలను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ చట్టంలోని వివిధ సెక్షన్లు అపార్ట్‌మెంట్ యజమానుల హక్కుల పరిరక్షణకు ఉద్దేశించినవి కావడంతో బిల్డర్ల ఆటలు ఇక సాగవనిపిస్తోంది. అనేక సంవత్సరాలుగా బిల్డర్లు రాష్ట్ర అపార్ట్‌మెంట్స్ చట్టం, కేంద్ర రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేసినవారికి హక్కులపై అవగాహన లేకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణం. 1987నాటి రాష్ట్ర అపార్ట్‌మెంట్ల చట్టంలో లోపభూయిష్టంగా ఉన్న అంశాలను బిల్డర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఆ బలహీనమైన చట్టం రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ సక్రమంగా అమలు జరగడంలేదు. ఆయా నగరాల్లో అపార్ట్‌మెంట్ ఓనర్లకు చెందాల్సిన ఉమ్మడి స్థలాల్లో ఎవరి వాటాను వారికి పూర్తిగా అప్పజెప్పకుండా ఆ వాటా స్థలాలను అక్రమంగా తమ సొంత ఆస్తులుగా బిల్డర్లు ఉంచుకుంటున్నారు. ఆ వాటా స్థలాలు తమకి చెందినవేనన్న సాకుతో నగర పాలక సంస్థల నుండి ఏ విధమైన అనుమతులు పొందకుండా అపార్ట్‌మెంట్లలో అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారు. ఈ విధంగా అధిక మొత్తంలో అక్రమ మార్గాల్లో ఆదాయాన్ని పొందుతున్న బిల్డర్లపై అపార్ట్‌మెంట్ల చట్టంలోని సెక్షన్ 28, 29 ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. అయితే ఇటు యజమానుల్లో అవగాహన లోపం, అటు అధికారులతో లాలూచీ వంటి కారణాలతో బిల్డర్లు ఇష్టారాజ్యంగా అక్రమాలు సాగిస్తున్నారు. అలాగే కొత్తగా అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేసేవారికి బిల్డర్లు తప్పనిసరిగా రిజిస్టర్డ్ డిక్లరేషన్ ప్రతిని, డీడ్ ఆఫ్ అపార్ట్‌మెంట్ ప్రతిని ఇవ్వాల్సి ఉంది. ఈ రెండు డాక్యుమెంట్ల ద్వారా తాము కొనదలచుకున్న ఆస్తికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోకుండా ఏ ఒక్క అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినా ఆ తరువాత యజమానులకు ఇబ్బందులు తప్పవని చట్టం హెచ్చరిస్తోంది. ఆయితే వీటన్నిటినీ గోప్యంగా ఉంచుతూ, ఉన్న చట్టాలను మరుగునపరిచి తప్పుడు హామీలతో అపార్ట్‌మెంట్లను విక్రయిస్తూ పబ్బం గడుపుకోవడం బిల్డర్లకు పరిపాటిగా మారింది. ఈ పరిస్థితుల్లో దేశమంతా ఒకే రీతిలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం జరిగేలా నియంత్రించడానికి రియల్ ఎస్టేట్ నియంత్రణ, అభివృద్ధి చట్టం- 2016ను పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడంతో ఆయా వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నూతన చట్టాన్ని దేశమంతా అమలు చేసేందుకు సిద్ధం కావడం హర్షణీయని అపార్ట్‌మెంట్ యజమానుల సంక్షేమ సంఘాల సమాఖ్య సంతోషం వెలిబుచ్చుతోంది.