బిజినెస్

సిరులు కురిపిస్తున్న ‘ఎన్‌టిపిసి’ బూడిద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, అక్టోబర్ 2: దేశ రాజధాని ఢిల్లీతోపాటు హర్యానా రాష్ట్రానికి నిరంతరం విద్యుత్‌ను అందిస్తూ, అక్కడి ప్రజల అవసరాల తీరుస్తూ ఇందిరా గాంధీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోంది. కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్‌టిపిసి.. హర్యానాలోని జజ్జార్‌లోగల తమ జాయంట్ వెంచర్ ఇందిరా గాంధీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ విద్యు దుత్పత్తి వివరాలను, అక్కడి అధునాతన పద్ధతులను అధ్యయనం చేస్తూ స్థానిక పాత్రికేయుల బృందంతో స్టడీ టూర్ నిర్వహించింది. ఈ పర్యటన సందర్భంగా అక్కడి ఉన్నతాధికారులు ప్రాజెక్ట్‌లో చేపడుతున్న విద్యు దుత్పత్తి వివరాలను వెల్లడించారు. ముఖ్యంగా యాష్ పాండ్ బూడిద రవాణా విషయంలో హర్యానా ఇందిరా గాంధీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తీసుకుంటున్న చర్యలు ప్రత్యేకమైనవి. 2,191 ఎకరాల్లో 1,500 మెగవాట్ల సామర్థ్యంతో ఈ థర్మల్ స్టేషన్‌ను కామన్ వెల్త్ గేమ్స్ విద్యుత్ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. 2006లో దీనికి శంకుస్థాపన జరగగా 44 నెలల్లోనే మొదటి దశలో 500 మెగావాట్ల ఉత్పత్తిని తీసుకువచ్చింది. అయతే విద్యుత్‌కు డిమాండ్ తక్కువగా ఉన్నా... యాష్ పాండ్ నుంచి వెలువడుతున్న బూడిదకు మాత్రం దేశంలో ఎక్కడా లేని డిమాండ్ ఇక్కడుంది. ప్రాజెక్ట్ చుట్టూ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం, జెకె సిమెంట్స్, జెకె లక్ష్మీ సిమెంట్‌తోపాటు ఇతర సిమెంట్ కర్మాగారాలు పెద్ద ఎత్తున బ్రిక్స్ ఇండస్ట్రీస్ ఉండడంతో ఇక్కడి బూడిదకు భలే డిమాండ్ కనిపిస్తోంది. రామగుండం ఎన్‌టిపిసి లో ఒక్క టన్ను ధర సుమారుగా 150 రూపాయలు పలుకుతుంటే, హర్యానాలోని ప్లాంట్‌లో 350 రూపాయలకుపైగా పలుకుతుండడం విశేషం. ఇక్కడ రోజుకు 150 ట్రక్కుల ద్వారా బూడిద రవాణా జరుగుతుంటుంది. ఒక్కరోజు కు ఈ థర్మల్ కేంద్రంలో 20 వేల టన్నుల బొగ్గును కాలుస్తుండగా, దీని ద్వారా వెలువడే బూడిదను హైకాన్‌స్ట్రేషన్ స్లర్రీ డిస్పోజల్ సిస్టమ్ ద్వారా యాష్ పాండ్‌కు తరలిస్తారు. బూడిద 60 శాతం, నీరు 40 శాతంతో యాష్ పాండ్‌లోకి బూడిదనంతా కూడా ఒక పేస్ట్‌లాగా డంప్ చేస్తుంటారు. ఇందుకోసం స్వీడన్ మెషనరీ వాడుతున్నారు. యాష్‌నంతా పాండ్‌లోకి డంప్ చేసిన తరువాత అక్కడ ఉన్న జలాలను కూడా వృథా కాకుం డా వెంట వెంటనే రిసైక్లిన్ చేసి వినియోగిస్తుండటం గమనార్హం. మరోవై పు ప్లాంట్‌లో భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఎక్కడా లేని విధంగా సుమారు 250 ప్రత్యేక సిసి కెమెరాలను ప్లాంట్ చుట్టూ ఏర్పాటు చేశారు. ఢిల్లీ ప్రాంతంలోని యమునా నదికి అనుసంధానంగా ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ కెనాల్ నుంచి ప్రత్యేక పైప్‌లైన్ పంపింగ్ ద్వారా నీటి రవాణా చేపడుతున్నారు. ఇదిలా ఉండగా 2వ దశ కింద మరో 660 మెగావాట్ల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఎన్‌టిపిసి. అయతే పవర్ డిమాండ్ తక్కువగా ఉండడంతో ఇప్పటికే వె య్యి మెగావాట్ల ఉత్పత్తిని ఆపేశారు.

హర్యానాలోని ఇందిరా గాంధీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్