బిజినెస్

పొగాకు ఉత్పత్తి పరిమితి పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 5: పొగాకు బోర్డు బ్యారన్ పరిమితిని పెంచింది. గత పంట కాలంలో ఒక బ్యారన్ రెండున్నర ఎకరాల విస్తీర్ణానికి 19.50 క్వింటాళ్ల దిగుబడి పరిమితి విధించింది. అయతే ప్రస్తుత సీజన్‌లో ఈ పరిమితిని సడలించారు. బ్యారన్ దిగుబడి 3 ఎకరాలకు పెంచి దిగుబడి పరిమితి 26 క్వింటాళ్లకు పెంచారు. నిరుడు దిగుబడి తక్కువ, డిమాండ్ ఎక్కువ కావడంతో రైతులకు మంచి ధర లభించింది. ఈ నేపథ్యంలో ఈ యేడు రైతులు వర్జీనియా పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది వర్జీనియా పంట వేసేందుకు రైతులు రెన్యువల్ చేసుకుంటున్నారు. సిగరెట్లకు మాత్రమే వినియోగించే వర్జీనియా పొగాకును రైతులు సంప్రదాయంగా నల్లరేగడి నేలల్లో పండిస్తున్నారు. నిరుడు సరాసరి ధర 99 రూపాయల 28 పైసలు పలికింది. తొర్రేడు ప్రాంతీయ వేలం కేంద్రంలో 81 రోజుల పాటు వేలం నిర్వహించారు. మొత్తం 2.7 మిలియన్ కేజీల విక్రయాలు జరిగాయి. ఉత్తరాది నల్లరేగడి భూముల్లో సాగయ్యే వర్జీనియా పొగాకును తొర్రేడు వేలం కేంద్రం నుంచే ఎగుమతి చేస్తున్నారు. ఏప్రిల్ మాసంతో అంతమైన సీజన్‌లో (2015-16) మొత్తం 1,391 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 1,491 బ్యారన్‌ల ఉత్పాదకతకు రిజిస్ట్రేషన్ సాగింది. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు పొగాకు బోర్డు నిర్దేశిత పరిమితికి మించి ఉత్పాదకత పెరిగితే అపరాధ రుసుం వసూలు చేస్తుంది. ఈ ఏడాది మొత్తం 1,274 హెక్టార్ల విస్తీర్ణంలో వర్జీనియా పొగాకు సాగైంది. 2,005 కేజీల సరాసరి దిగుబడి లభించింది. ఈ సీజన్ నుంచి ఉత్పత్తి పరిమితి బ్యారన్‌కు రెండున్నర ఎకరాల నుంచి మూడు ఎకరాలకు పెంచి 26 క్వింటాళ్ల దిగుబడికి అవకాశం ఇవ్వడంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగేందుకు అవకాశం ఉంది. కాగా, ఇటీవలి వేలంలో అత్యధికంగా రూ. 170, అత్యల్పంగా రూ. 20 ధరలో వేలం నిర్వహించారు. మొత్తం 1,274 హెక్టార్ల విస్తీర్ణంలో వర్జీనియా పొగాకు సాగు జరగ్గా, 2.70 మిలియన్ కేజీల దిగుబడి మార్కెటింగ్ జరిగింది. ప్రస్తుత సీజన్‌కి సంబంధించి (2016-17) వారం రోజులుగా రైతుల రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో వర్జీనియా పొగాకు పండించే రైతులు శరవేగంగా రెన్యువల్ చేయించుకుంటున్నారు. ఇప్పటివరకు 900 మంది రైతులు 925 బ్యారన్‌లకు 11,010 హెక్టార్లకు రిజిస్ట్రేషన్ చేశారు.