బిజినెస్

అదానీ చేతికి ఆర్‌ఇన్‌ఫ్రా విద్యుత్ వ్యాపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ (ఎటిఎల్) సంస్థకు తమ పవర్ ట్రాన్స్‌మిషన్ ఆస్తులను అమ్మేసింది రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఆర్‌ఇన్‌ఫ్రా). 2,000 కోట్ల రూపాయలకుపైగా ధరకు ఈ ఆస్తులను అమ్మేయగా, ఇందుకు సంబంధించి ఒప్పందం కుదిరినట్లు బుధవారం తెలిపింది అనీల్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌ఇన్‌ఫ్రా. కాగా, ఆర్‌ఇన్‌ఫ్రా ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌మిషన్ లైన్లు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నాయి. అంతేగాక హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన మరో ప్రాజెక్టులోనూ ఆర్‌ఇన్‌ఫ్రాకు 74 శాతం వాటా ఉంది. ఇదిలావుంటే ఈ ఏడాది మార్చి 31 నాటికి రిలయన్స్ ఇన్‌ఫ్రా రుణభారం 25,100.81 కోట్ల రూపాయలుగా ఉంది. తాజా లావాదేవీతో వచ్చిన 2 వేల కోట్ల రూపాయలను ఈ రుణభారాన్ని తగ్గించుకోవడానికి ఆర్‌ఇన్‌ఫ్రా వినియోగించనుంది.

సిఏ సంస్థపై హైకోర్టు మూడేళ్ల నిషేధం

హైదరాబాద్, అక్టోబర్ 5: ప్రజలను తప్పుదోవబట్టించిన ఒక సంస్థకు తప్పుడు ధృవపత్రం ఇచ్చినందుకు హైదరాబాద్‌కు చెందిన చార్టెర్డ్ అకౌంటెంట్ సంస్థను మూడేళ్లపాటు చార్టెర్డ్ అకౌంటెంట్ కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. మెసర్స్ ఎం గంగ్ అండ్ కంపెనీపై అభియోగాలు మోపుతూ ఈ అంశంపై హైకోర్టులో ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. రీతీష్ పాలిస్టర్ సంస్థకు ఆడిటర్ సంస్థగా మెసర్స్ ఎం గంగ్ అండ్ కో సంస్థ పనిచేస్తోంది. సెబీ కూడా దర్యాప్తు చేసి ఈ సిఏ సంస్థ రితీష్ పాలిస్టర్ సంస్థ తప్పిదాలను కప్పిపుచ్చి ధృవపత్రం ఇచ్చారని హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. కాగా, ఈ ఘటన 1995లో జరిగినందు వల్ల ఉదారంగా వ్యవహరించాలని సిఏ సంస్థ తరఫున న్యాయవాది కోర్టును అభ్యర్ధించారు. వాద ప్రతివాదనలు విన్న తర్వాత వృత్తిపరంగా తప్పిదాలకు పాల్పడిన సిఏ సంస్థను 2016 సెప్టెంబర్ 1వ తేనదీ నుంచి 2019 అక్టోబర్ 31వ తేదీ వరకు మూడేళ్ల పాటు చార్టెర్డ్ అకౌంటింగ్ కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు హైకోర్టు జారీ చేసింది.