కృష్ణ

బుడగ జంగాలను తిరిగి ఎస్సీలుగా గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మహాగర్జనలో వక్తల డిమాండ్
* సభానంతరం రోడ్డుపై బైఠాయింపు
* పోలీసు లాఠీఛార్జితో ఉద్రిక్తత
* 150 మంది అరెస్ట్
విజయవాడ, మార్చి 11: అనేక సంవత్సరాలుగా కూడు, గుడ్డ, గూడు కోసం కళను వృత్తిగా నమ్ముకుని సమ్మెట తంబూర్ అందెలతో ఊరూరా తిరుగుతూ బుర్రకథలు చెబుతూ, యక్షగానాలు ఆడుతూ సంచార జీవనం గడుపుతున్న బేడ (బుడగ) జంగాలను తిరిగి ఎస్సీలుగా గుర్తించాలని శుక్రవారం నాడిక్కడ జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన మహాగర్జన బహిరంగ సభలో వక్తలు డిమాండ్ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన జాతీయ అధ్యక్షుడు కూరపాటి బాలగురుమూర్తి మాట్లాడుతూ 1950లో భారతరత్న అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం 59 ఎస్సీ కులాల్లో బేడ జంగం కులాన్ని కూడా పొందుపరచారన్నారు. రాష్ట్రంలో ఆర్‌డివో పరిధిలో ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను అందజేస్తుండగా తాము చేపట్టిన ఉద్యమాల ఫలితంగా 2008లో మండల స్థాయిలోనే కులధ్రువీకరణ పత్రాలు మంజూరయ్యాయన్నారు. 84 జీవో జారీ అయిందన్నారు కాని వీరి అభివృద్ధిని చూసి ఓర్వలేని స్వార్థ రాజకీయ నాయకులు రాజ్యాంగంలోని కొన్ని లొసుగుల ఆధారంగా తెలంగాణ ప్రాంతంలోని వారికే ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యేలా 2008 జూలై 17న 144 జీవో జారీ అయిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ రాష్ట్రంలో గ్రామ సర్పంచ్ పదవికి కూడా పోటీచేసే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ 144 జీవో ప్రకారం తమ విద్యార్థులకు హాస్టల్ వసతి, ఫీజులు, స్కాలర్‌షిప్‌లు రాక వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అయితే తమ పోరాటాల ఫలితంగా రాష్ట్రంలో బేడ, జంగాల స్థితిగతులపై అధ్యయనం కోసం జస్టిస్ మోతీలాల్ బి నాయక్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేసి ఆరుమాసాల్లో నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వం 2010 అక్టోబర్ 20న 64 జీవో జారీ చేసిందని ఆయన గుర్తుచేశారు. ఇకనైనా తమను ఎస్సీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సభానంతరం వారు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అనుమతి లేదని పోలీసులు వారించినా కదలకపోవటంతో లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. ఈసందర్భంలో ఉద్రిక్తత నెలకొంది. 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.