రాష్ట్రీయం

మూసపద్ధతి మనకొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీటి పారుదలకు రూ.25 వేల కోట్లు
మిగతా నిధులపై వ్యూహాత్మక ప్రణాళిక
నూరుశాతం పన్నులు వసూలుకావాలి
బడ్జెట్ రూపకల్పనపై కెసిఆర్ దిశానిర్దేశం

హైదరాబాద్, డిసెంబర్ 29: జనవరి నెలాఖరులో ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. బడ్జెట్ రూపకల్పనలో ప్రభుత్వ ప్రాధాన్యతలు, అవసరాలపై మంత్రులు, అధికారులకు సిఎం కె చంద్రశేఖర్‌రావు దిశా నిర్దేశం చేశారు. సచివాలయంలో మంగళవారం 2016-17 బడ్జెట్ రూపకల్పనపై ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, సిఎస్ రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శులు రామకృష్ణరావు, శివశంకర్, ప్రణాళికశాఖ కార్యదర్శి బిపి ఆచార్య, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు బిఆర్ రెడ్డితో సిఎం చర్చించారు. వచ్చే బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయంలో నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు కేటాయిస్తున్నందున, మిగతా నిధులను జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వినియోగించుకోవాల్సి ఉంటుందని సిఎం సూచించారు. ప్రణాళికేతర వ్యయాన్ని ఎంత తగ్గించ గలిగితే అంత ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయవచ్చని సిఎం అభిప్రాయపడ్డారు. దుబారాను బాగా తగ్గించగలిగితే ప్రణాళికేతర వ్యయాన్ని అదుపు చేయడం సాధ్యమవుతుందని సూచించారు. ప్రభుత్వ శాఖల్లో అంతర్గత సామర్థ్యం పెరగాలని, పన్నుల వసూళ్లు నూరుశాతం జరగాలని ఆదేశించారు. బడ్జెట్ రూపొందించడంలో గతంలో అనుసరించిన మూస పద్ధతులను కాకుండా తెలంగాణ ప్రజల అవసరాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధుల కేటాయింపు జరగాలని సూచించారు. జిల్లాలవారీగా అన్ని శాఖలు తాము చేసే పనులపై పూర్తి నివేదికలు తయారుచేసి ఆర్థికశాఖకు సమర్పించాలని ఆదేశించారు. మంత్రులు ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులెన్ని, వాటిలో ఎంత ఖర్చు చేశారు? ఇంకా ఎన్ని మిగిలిపోయిన పనులకు ఎన్ని నిధులు అవసరమో పూర్తిస్థాయిలో అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు తయారుచేయాలని ఆదేశించారు. ప్రతిపాదనలకు అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు జరగాలన్నారు.
రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేయాల్సి ఉందని, రైతులకు సాగునీరు అందించడం కోసం ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉండటంతో ప్రణాళిక వ్యయం ఎక్కువగా ఉండే విధంగా బడ్జెట్ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. (చిత్రం) సచివాలయంలో బడ్జెట్ రూపకల్పనపై మంత్రులు, వివిధ శాఖల విభాగాధిపతులతో సమీక్షిస్తున్న సిఎం కెసిఆర్