రాష్ట్రీయం

కూలిన సిటీ బస్‌స్టేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని గౌలిగూడలోని సిటీ బస్‌స్టేషన్ కుప్పకూలింది. నిజాం నవాబుల కాలంలో నిర్మితమైన ఈ బస్‌స్టేషన్ శిథిలావస్థకు చేరింది. దీంతో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా బస్ట్‌స్టేషన్‌ను ఖాళీ చేయించారు. దాదాపు 80వేల మంది ప్రయాణీకులకు సేవలు అందించే ఈ బస్‌స్టేషన్ పూర్తిగా శిథిలావస్థకు చేరటంతో పడగొట్టి పునర్నిర్మాణం చేయాలని భావించి బస్సులను, సిబ్బందిని తరలించారు. ఈ ఉదయం బస్‌స్టేషన్ కుప్పకూలింది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని ఆర్టీసీ ఇంఛార్జీ ఎండి సునీల్‌శర్మ వెల్లడించారు.