తెలంగాణ

పెరిగిన బస్ ఛార్జీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బస్ ఛార్జీలను భారీగా పెంచింది. కనీస బస్ ఛార్జీని రూ.10లు చేశారు. పల్లె వెలుగు నుంచి ఏసీ స్లీపర్ వరకు భారీ ఎత్తున బస్ ఛార్జీలను పెంచారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.15, డీలక్స్ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.12లకు పెంచింది. బస్‌పాస్‌లను సైతం భారీగా పెంచారు. బస్‌పాస్ ఛార్జీ రూ.770ల నుంచి రూ.950లకు, మెట్రో బస్‌పాస్ ఛార్జీ రూ.990 నుంచి రూ.1180కి పెంచగా.. స్టూడెంట్‌ బస్‌పాస్‌ రూ.390 నుంచి రూ.495కి పెంచింది. సూపర్‌ లగ్జరీలో కనీస చార్జీని రూ.25కి... రాజధాని, వజ్ర, గరుడ, గరుడ ప్లస్‌లో రూ.35 కనీస చార్జీ పెంచగా.. వెన్నెల ఏసీ స్లీపర్‌లో కనీస చార్జీ ఆర్టీసీ రూ. 75 చేసింది.