బిజినెస్

మద్యం ఆదాయంపై ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 29: సాధారణంగా వార్షిక బడ్జెట్‌తో ప్రమేయం లేకుండానే ఆర్థిక సంవత్సరం ముగింపునకు రెండు, మూడు మాసాల ముందుగానే రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ పేరిట ట్రెజరీలలో బిల్లుల చెల్లింపులపై రోజుకో విధమైన ఆంక్షలు విధించడం చూస్తుంటాం. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన 16 వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటు భర్తీపై కేంద్రం మీన మేషాలు లెక్కిస్తున్నది. తాజాగా 500, 1,000 రూపాయల నోట్ల రద్దు ప్రభావం అన్ని రంగాలతోపాటు ప్రభుత్వంపై కూడా పడింది. వీటన్నింటి నేపథ్యంలో డిసెంబర్ మొదటి వారంలో చెల్లించాల్సిన ఉద్యోగుల జీతభత్యాలపై రకరకాల ఊహాగానాలు వినవస్తున్న నేపథ్యంలో క్రమేణా వట్టిపోతున్న ఖజానా భర్తీకోసం రాష్ట్ర ప్రభుత్వం పడరానిపాట్లు పడుతున్నది. దీనిలో భాగంగా ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు ఓ వైపు మద్యం అమ్మకాలను పెంచేందుకు ప్రయత్నిస్తుంటే, తాజాగా మద్యం దుకాణాలు 2017 ఫిబ్రవరిలో చెల్లించాల్సిన లైసెన్సు ఫీజు చివరి వాయిదా సొమ్మును తక్షణం జమ చేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలుగా ఒత్తిడి తెస్తోంది. ఇందుకోసం మద్యం వ్యాపారుల సంఘం నేతలతో ప్రభుత్వం మంతనాలు సాగిస్తున్నట్టు తెలిసింది. సాధారణంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై సాలీనా దాదాపు 13 వేల కోట్ల రూపాయలకుపైగా ఆదాయం చేకూరుతున్నది. ఇక మద్యం దుకాణాలకు సంబంధించిన లైసెన్సు ఫీజును రెండేళ్లలో ప్రతి నాలుగు మాసాలకోసారి ఆరు దఫాలుగా చెల్లించాల్సి ఉంది. ఐదో వాయిదా సొమ్మును గత నవంబర్ మాసంలోనే జమ చేయడం జరిగింది. ఇక చివరి వాయిదా సొమ్మును 2017 ఫిబ్రవరిలో జమ చేయాల్సి ఉంటే ప్రస్తుత ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ దఫా ముందుగానే జమ చేయాలంటూ అటు సిండికేట్లు, ఇటు ఎక్సైజ్ అధికారుల ద్వారా మద్యం దుకాణాల యజమానులపై తీవ్రస్థాయిలో ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. రాష్టవ్య్రాప్తంగా దాదాపు 14 వేల మద్యం దుకాణాలుంటే వీటి నుంచి చివరి వాయిదా సొమ్ము వచ్చే ఫిబ్రవరిలో దాదాపు 3 వేల కోట్ల రూపాయ లకుపైగా జమ కావాల్సి ఉంది. అయతే ఈ సొమ్మును ముందుగానే రాబట్టుకునే ఆలోచనతో ప్రభుత్వం ప్రస్తుతానికి నూతన ఎక్సైజ్ పాలసీ అమలును వాయిదా వేసుకోవటానికీ సిద్ధమైనట్లు సమాచారం. అందుకే వైన్ డీలర్ల అసోసియేషన్ నాయకులు ముందస్తు సొమ్ము చెల్లింపులకు సిండికేట్లపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.