బిజినెస్

మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన టిఎస్‌ఐఐసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ (టిఎస్‌ఐఐసి) ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఓ మొబైల్ యాప్‌ను రూపొందించింది. దీన్ని టిఎస్‌ఐఐసి చైర్మన్ జి బాలమల్లు గురువారం ఇక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టిఎస్‌ఐఐసి చేపట్టిన పారిశ్రామిక వాడల అభివృద్ధి, పరిశ్రమల స్థాపనకు సంబంధించిన విలువైన సమాచారం, అభివృద్ధి చేసిన ప్లాట్ల వివరాలను ఈ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తెలుసుకోవచ్చన్నారు. ప్రతిపాదిత పారిశ్రామిక వాడలు విమానాశ్రయం నుంచి ఉండే దూరం, ప్లాట్ల సరిహద్దులు, రోడ్లతో అనుసంధానం తదితర వివరాలు ఇందులో ఉంటాయన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు భవన నిర్మాణానికి ఆమోదం నిమిత్తం దరఖాస్తులను కూడా ఈ యాప్ ద్వారా పంపవచ్చని, ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేయవచ్చన్నారు. ప్లాట్ల కేటాయింపు, పరిశ్రమల స్థాపనకు మార్గదర్శకాల వివరాలు అన్నీ ఈ యాప్‌లో సమ్రగంగా ఉంటాయని స్పష్టం చేశారు. కాగా, భూమి ధర, ఆస్తి పన్ను, ఇతర చార్జీలను ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తామని, యువకులకు పరిశ్రమల స్థాపనపై శిక్షణ ఇస్తామని చెప్పారు. ఆన్‌లైన్ సేవలను సులువు చేయడం మంచి పరిణామమన్న బాలమల్లు.. సరళీకృతంగా వాణిజ్య నిర్వహణలో తెలంగాణ మొదటి స్థానం రావడంలో టిఎస్‌ఐఐసి కీలక పాత్ర వహించిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా టిఎస్‌ఐఐసి ఎండి ఇ వెంకట నరసింహారెడ్డి.. హైదరాబాద్ ఫార్మాసిటీ, నిమ్జ్, ఫుడ్ పార్కులు, టెక్స్‌టైల్ పార్కులు, తోళ్ల పార్కులు, ప్లాస్టిక్ పార్కులు, ఫైబర్ గ్లాస్ పార్కుల వివరాలను వెల్లడించారు.