బిజినెస్

డిపాజిట్లపై ఉచిత టాక్‌టైమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభించిన దేశీయ టెలికామ్ రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. తమ నూతన సేవింగ్స్ ఖాతాదారులకు టాక్‌టైమ్‌ను ఆఫర్ చేస్తోంది. కస్టమర్లు డిపాజిట్ చేసే ప్రతి రూపాయికి ఒక నిమిషం టాక్‌టైమ్ (తమ నెట్‌వర్క్ పరిధిలోనే)ను ఇస్తోంది. ఈ అవకాశం తొలిసారి డిపాజిట్లకే ఉంటుం ది. ‘ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతాను తెరిచిన ఏ కస్టమర్‌కైనా తాను డిపాజిట్ చేసే మొత్తం లో ప్రతి రూపాయికి ఒక నిమిషం చొప్పున టాక్‌టైమ్ పొందుతారు. ఎయిర్‌టెల్ మొబైల్ నెంబర్లకు మాత్ర మే ఈ టాక్‌టైమ్ వర్తిస్తుంది.’ అని ఓ ప్రకటనలో ఎయిర్‌టెల్ తెలిపింది. అంటే వెయ్యి రూపాయల డిపాజిట్‌తో ఎవరైనా ఖాతాను తెరిస్తే, వారి ఎయిర్‌టెల్ మొబైల్ నెంబర్‌కు వెయ్యి నిమిషాల టాక్‌టైమ్ ఉచితమన్నమాట. ఈ టాక్‌టైమ్‌ను దేశవ్యాప్తంగా వినియోగించుకోవచ్చు. గత నెల 23న రాజస్థాన్‌లో పైలట్ ప్రాజెక్టుగా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు మొదలైనది తెలిసిందే. కేవలం రెండు రోజుల్లోనే పది వేలకుపైగా కస్టమర్లు సేవింగ్స్ ఖాతాలను తెరిచారని ఎయిర్‌టెల్ తెలిపింది. సేవింగ్స్ ఖాతా డిపాజిట్లకు అధిక వడ్డీరేటును ఇస్తున్నామని, ఖాతాదారులకు లక్ష రూపాయల వ్యక్తిగత బీమా సౌకర్యా న్నీ కల్పిస్తున్నామని పేర్కొంది. మొత్తా నికి టెలికామ్ సంస్థ కదా.. ఖాతాదా రులకు ఉచిత టాక్‌టైమ్ ఆఫర్లను ప్రకటిస్తూ, అటు బ్యాంక్ ఖాతాదారు లను, ఇటు మొబైల్ వినియోగ దారులనూ పెంచుకుంటోంది.