బిజినెస్

ఎన్‌ఎస్‌ఇ చీఫ్ చిత్రా రామకృష్ణ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 2: నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) సిఇఒ, ఎండిగా శుక్రవారం చిత్రా రామకృష్ణ తప్పుకున్నారు. 2018 మార్చి వరకు ఆమె పదవీకాలం ఉన్నప్పటికీ, ఎన్‌ఎస్‌ఇ బోర్డులోని కొందరు సభ్యులతో నెలకొన్న విభేదాల మధ్య ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. 2013 ఏప్రిల్‌లో సిఇఒ, ఎండిగా చిత్రా రామకృష్ణ ఎంపికయ్యారు. మరోవైపు ఆమె స్థానంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ జె రవిచంద్రన్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. మాజీ ఆర్థిక కార్యదర్శి అశోక్ చావ్లా నేతృత్వంలోని ఎన్‌ఎస్‌ఇ బోర్డు కొత్త చీఫ్‌ను ప్రకటించేదాకా రవిచంద్రన్ బాధ్యతలు కొనసాగుతాయి. కాగా, 1992లో ఎన్‌ఎస్‌ఇ ఏర్పాటుకు చిత్రా రామకృష్ణ విశేషంగా కృషి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ ఎక్స్‌చేంజ్‌లలో మహిళలు నాయకత్వం వహిస్తున్న వాటిలో చిత్రా రామకృష్ణ కారణంగా ఎన్‌ఎస్‌ఇ కూడా ఒకటైంది. అయతే ఇప్పుడిది గతమే అయ్యంది.