బిజినెస్

టొయోటా వాహన ధరలకు రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: కార్ల ధరలను పెంచనున్నట్లు టొయోటా కిర్లోస్కర్ మోటార్ సోమవారం ప్రకటించింది. జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. పెరిగిన ఉత్పాదక వ్యయం, ఫారిన్ ఎక్స్‌చేంజ్ ధరల్లో చోటుచేసుకుంటున్న మార్పుల మధ్య ధరల పెంపు అనివార్యమైందని తెలిపింది. స్టీల్, అల్యూమినియం, కాపర్, రబ్బర్ ధరలు పెరిగాయని, కాబట్టి తమ వాహనాల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు వివరించింది. హచ్‌బ్యాక్ లివా నుంచి ప్రీమియం ఎస్‌యువి లాండ్ క్రూయిజర్ 200 రేంజ్ వరకు వాహనాలను ప్రస్తుతం టొయోటా విక్రయిస్తోంది.