బిజినెస్

జిసిసి కుంకుడు షాంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 6: అటవీ ఉత్పత్తుల్లో ముఖ్యమైనది, సహజ సిద్ధమైన, ఆరోగ్యప్రదమైన కుంకుళ్ళ నుంచి హెయిర్ షాంపును తయారు చేయాలని గిరిజన సహకార సంస్థ (జిసిసి) నిర్ణయించింది. నూతన సంవత్సర కానుకగా దీనిని దేశీయ మార్కెట్‌లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. గడచిన రెండేళ్ళ కాలంలో అనేక రకాలైన ఆకర్షణీయమైన పథకాలు, ప్రయోగాలతో చక్కటి ఫలితాలు సాధించిన జిసిసి.. ఇప్పుడు మరో సరికొత్త ప్రాజెక్టును జాతీయ మార్కెట్‌లోకి తీసుకురావాలని నిశ్చయించింది. కుంకుడు కాయల నుంచి తీసే పిప్పి, నురగతో తలకు ఉపయోగించే ‘హెయిర్ షాంపు’ను తయారు చేయనుంది. సహజ సిద్ధమైన కుంకుళ్ళ ద్వారా తయారయ్యే షాంపు వాడకం వలన ఎటువంటి హాని ఉండకపోగా, ధృడమైన శిరోజాలకు ఆస్కారముంటుంది. అంతేగాక తెల్లదనాన్ని దూరంగా ఉంచే గుణం కుంకుళ్లకు ఉన్నందున జుట్టు నల్లగా ఉంటుందని, దీనికి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని సంస్థ భావిస్తోంది.
కాగా, సాధారణంగా మార్కెట్‌లో అమ్మే షాంపుల మాదిరిగానే వీటిని మార్కెట్‌లోకి జిసిసి దింపనుంది. అలాగే 100 నుంచి 500 గ్రాముల సిసాలతో కూడిన షాంపులతోపాటు ప్యాకెట్లనూ అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ యాజమాన్యం ఆలోచన చేస్తోంది. ఇందుకోసం ప్రాజెక్ట్ రిపోర్టు సిద్ధం చేస్తోంది. అదీ జిసిసి బ్రాండ్‌తోనే ‘హెయిర్ షాంపు’లు దేశీయ మార్కెట్‌లో ప్రవేశపెడితే వచ్చే ఆదరణనుబట్టి పూర్తిస్థాయిలో కుంకుళ్ళ షాంపులను పెద్ద ఎత్తున తయారు చేయాలని కూడా నిర్ణయించింది. తొలుత ఆంధ్రాలో దీనిని ప్రవేశపెట్టి దశలవారీగా మార్కెట్‌లోకి విస్తరించాలని కూడా ఆలోచన చేస్తోంది. తొలిదశలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అటవీ ప్రాంతాల నుంచి భారీగా కుంకుళ్ళను గిరిజన రైతుల నుంచే సేకరించడం, వారికి గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా దళారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించడంతోపాటు వీరికి ఉపాధి కల్పించినట్టు అవుతుందని జిసిసి యాజమాన్యం భావిస్తోంది. ఈ విధంగా కుంకుడు పంటను మరింతగా ప్రోత్సహిస్తే గిరిజనులకు మేలు జరగడంతోపాటు శరీరానికి, ముఖ్యంగా తలకు ఎటువంటి హాని చేయని కుంకుళ్ళ షాంప్‌ను వినియోగదారులకు అందించినట్ల వుతుందని జిసిసి అనుకుంటోంది. వీటిని విక్రయించేందుకు డిస్ట్రిబ్యూటర్ల నియామకం, మార్కెటింగ్ వంటి వాటిపైనా సంస్థ దృష్టి పెడుతోంది.
రసాయనాల మిశ్రమంతో తయారైన అనేక రకాలైన షాంపుల వాడకంతో తెలియని అంతుబట్టని రుగ్మతలకు గురవుతున్న వినియోగదారులు అసలు విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుంటున్నారు. జట్టు తెలబడటం, నల్లని జట్టు సైతం అతి సులభంగా రాలిపోవడం, ఫలితంగా బట్టతలకు దారితీయడం, తరచూ వాడే ఇటువంటి షాంపులతో నరాలపై దీని ప్రభావం చూపడం, అలాగే కంటి చూపు కోల్పోవడం వంటి తదితర వ్యాధుల బారిన పడక తప్పదని వైద్య నిపుణులే చెబుతున్నారు. అయినా వీటికి ప్రత్యామ్నాయం లేక తల వెంట్రులకు పట్టే జిడ్డు, దుమ్ము, ధూళి నిమిషంతో తొలగించే ఇటువంటి షాంపులనే వినియోగదారులు వాడక తప్పడంలేదు. అయితే 90 శాతం మేర శరీరానికి హాని తలపెట్టే ఈ తరహా షాంపులకు దీటుగా సహజసిద్ధమైన కుంకుడు నుంచి తయారు చేసే హెయిర్ షాంపులు మార్కెట్‌లోకి దించితే చక్కటి ఫలితాలు వస్తాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్‌పిఎస్ రవిప్రకాష్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు. ఈ విధంగా చేయడం వలన ప్రజలకు మేలు చేసినట్టు అవుతుందని, మరోపక్క సంస్థ ఆదాయాన్ని మరింతగా పెంచుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నింటి కంటే ప్రధానంగా పాత కాలంనాటి ప్రజానీకం అత్యధికంగా ప్రాధాన్యతనిచ్చే కుంకుళ్ళ వాడకాన్ని మళ్ళీ మార్కెట్‌లోకి తీసుకువచ్చే లక్ష్యంతో దీనికి శ్రీకారం చుడుతున్నట్టు ఆయన తెలిపారు. కుంకుళ్ళు, షీకాయ వంటి సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తుల వాడకం రోజుల్లో తల వెంట్రుకుల గట్టిదనానికి ఢోకా ఉండేదికాదు. అలాగే తెలుపు రంగు అవకాశం లేకుండా పోయేది. ఇపుడు మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్న ఈ షాంపుల ద్వారా దేశీయంగా ఆదరణ పొందేందుకు అవకాశాలు లభించనున్నాయి.