బిజినెస్

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 43.66 పాయింట్లు పెరిగి 26,392.76 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 14.40 పాయింట్లు అందుకుని 8,143.15 వద్ద నిలిచింది. బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్ష జరగనున్న క్రమంలో ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల మధ్య మదుపరులు పెట్టుబడుల వైపే మొగ్గుచూపారు. వడ్డీరేట్లు పావు శాతం తగ్గనున్నాయన్న అంచనాలు మదుపరులను ఉత్సాహపరుస్తోంది. సోమవారం కూడా ఇదే కారణంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసినది తెలిసిందే. ఇకపోతే మంగళవారం ట్రేడింగ్‌లో రియల్టీ, చమురు, గ్యాస్ రంగాల షేర్లు 1.73 శాతం, 1.17 శాతం చొప్పున లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్ సూచీలు లాభపడగా, చైనా సూచీ నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ సూచీలు లాభపడితే, బ్రిటన్ సూచీ నష్టపోయింది.