బిజినెస్

హైదరాబాద్-కడప మధ్య ‘ట్రూజెట్’ సేవలు నేటి నుంచే ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: హైదరాబాద్ నుంచి కడపకు, కడప నుంచి హైదరాబాద్, కడప నుంచి తిరుపతి పట్టణాలకు ఈ నెల 8 నుంచి విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ట్రూజెట్ విమానయాన సంస్థ వెల్లడించింది. ఈ సెక్టార్‌లో విమాన సర్వీసులను నడుపుతున్న ఏకైక సంస్థ ట్రూజెట్ మాత్రమేనని టర్బో మెగా ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ వంకాయలపాటి ఉమేష్ తెలిపారు. 1980 వరకు వాయుదూత్ సర్వీస్ ద్వారా హైదరాబాద్ నుంచి కడపకు సర్వీసు ఉండేదాని, చాలా రోజుల తర్వాత మళ్లీ విమాన సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వారానికి నాలుగురోజుల పాటు ఈ సర్వీసులు నడుపుతామని, ప్రజల నుంచి స్పందన ఏ మేరకు ఉంటుందో అంచనావేసి ఆ తర్వాత మరికొన్ని సర్వీసులను విస్తరిస్తామని ఉమేష్ వెల్లడించారు. శుక్ర, శని, ఆది, సోమవారాల్లో హైదరాబాద్ నుంచి ఉదయం 10.05 గంటలకు బయలుదేరి కడపకు 11.10కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కడప నుంచి తిరుపతి మీదుగా హైదరాబాద్‌కు ఉదయం 11.35కి బయలుదేరి మధ్యాహ్నాం 2.05 గంటలకు చేరుకుంటుందని ఆయన తెలిపారు. కడప నుంచి ఉదయం 11.35కి బయలుదేరి, మధ్యాహ్నాం 12.20కి తిరుపతి చేరుకుంటుందని, తిరిగి తిరుపతిలో మధ్యాహ్నాం 112.45కి బయలుదేరి మధ్యాహ్నాం 2.05 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని ఆయన వెల్లడించారు.