బిజినెస్

బయో మైనింగ్‌తో చెత్తకు మోక్షం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 12: డంపింగ్ యార్డుల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్త, ఘన వ్యర్థాలకు బయో మైనింగ్‌తో చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. డంపింగ్ యార్డులకు ఎక్కువ స్థలాలను కేటాయించడం సమస్యగా మారుతున్న తరుణంలో ఉన్న స్థలాన్ని మరింతగా సద్వినియోగం చేసుకోవడమే కాకుండా ప్రాసెస్ చేసిన చెత్తను మట్టిలో కలిసిపోయేలా చేసే అవకాశం ఈ విధానంలో ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 110 పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో నిత్యం వేలాది టన్నుల ఘన వ్యర్థాలు పోగుపడుతున్నాయి. ఈ చెత్తను వేసేందుకు ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. కానీ చెత్తను అలా వేసుకుంటూ పొవడం వల్ల ఒక దశలో అదనపు స్థలం లభించని పరిస్థితి నెలకొంటోంది. రాష్ట్రంలో నగరాలు, పట్టణాల పరిధిలో చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేసి పారిశుద్ధ్య సిబ్బంది సేకరిస్తున్నారు. దీనివల్ల కొంతమేరకు చెత్త సమస్యను నియంత్రించే వీలుంటోంది. అయితే ఇప్పటికే డంపింగ్ యార్డుల్లో వేసిన చెత్త అలా ఉండిపోతోంది. అందులో ప్లాస్టిక్, ఇనుము, తదితర వ్యర్థాలు ఉంటున్నాయి. కొంతమేర వ్యర్థాలు భూమిలో కలిసిపోయే వీలున్నప్పటికీ, అధిక శాతం అలానే ఉండిపోతున్నాయి. దీనివల్ల స్థలం సమస్య వేధిస్తోంది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి, వర్మీ కంపోస్టు వంటివి తయారుచేసే వీలున్నా.. బయో మైనింగ్ ద్వారా ఇప్పటికే ఉన్న చెత్తకుప్పలను వివిధ రకాలుగా విభజించి ఇతర అవసరాలకు ఉపయోగించవచ్చని నిపుణులు అంటున్నారు. తమిళనాడులో కొన్ని పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలో దీన్ని అమలు చేస్తున్నారు.
బయో మైనింగ్ అంటే..
డంపింగ్ యార్డుల్లో ఇప్పటికే ఉన్న చెత్తను చిన్న పోగుల్లా మార్చుతారు. వాటిపై మైక్రో ఆర్గానిజం సృష్టించే ఒక ద్రావకాన్ని రోజు విడిచి రోజు 45రోజుల పాటు పిచికారీ చేస్తారు. చెత్తకుప్పలను కలియబెడుతూ చల్లడం వల్ల ఆ కుప్ప సేంద్రియ, సేంద్రియేతర అంశాలుగా విభజించేందుకు వీలవుతుంది. ఇందులో సేంద్రియ పదార్థాలు భూమిలో కలిసిపోయోలా తయారవుతాయి. ప్రత్యేక యంత్రాలను ఉపయోగించి ఆ చెత్తను విభజిస్తారు. ఇందులో సేంద్రియ పదార్థంతోపాటు ఇనుము, ప్లాస్టిక్, 15 రకాలుగా విభజించే వీలుంటుంది. సేంద్రియ పదార్థాన్ని రైతులకు ఎరువుగా విక్రయిస్తారు. ప్లాస్టిక్, ఇనుము, రబ్బర్ వంటి వాటిని రీసైక్లింగ్ చేసేవారికి పంపుతారు. దీనివల్ల డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన చెత్తకుప్పలకు తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా వినియోగించే వీలుంటుంది. పట్టణాల్లో, కొన్ని పంచాయతీల పరిధిలో దీన్ని ప్రయోగాత్మంగా అమలుచేస్తే బాగుంటుందని పురపాలక శాఖకు చెందిన ఒక అధికారి సూచించారు. స్థలాల కేటాయింపు సమస్యగా మారుతున్న తరుణంలో బయో మైనింగ్ ఉపయుక్తంగా ఉంటుందని, తమిళనాడులో చాలాచోట్ల ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని ఆయన వివరించారు.