బిజినెస్

సైరస్ మిస్ర్తికి మరో దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 12: టాటా ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా సైరస్ మిస్ర్తిని సోమవారం తొలగించారు. ఇక్కడ జరిగిన సంస్థ అసాధారణ వార్షిక సమావేశం (ఇజిఎమ్)లో భాగస్వాములు మిస్ర్తికి వ్యతిరేకంగా ఓటేశారు. టాటా గ్రూప్ చైర్మన్‌గా మిస్ర్తికి అక్టోబర్‌లో టాటా సన్స్ ఉద్వాసన పలికినది తెలిసిందే. 100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన 100కుపైగా సంస్థలున్న టాటా గ్రూప్‌లో ఒక్కో సంస్థ నుంచి మిస్ర్తిని బయటకు పంపుతోంది టాటా సన్స్. అయితే ఓ సంస్థ బోర్డు నుంచి ఇలా అధికారికంగా పంపేయడం ఇదే తొలిసారి. అన్ని సంస్థల ఇజిఎమ్‌లకు టాటాలు పిలుపునివ్వగా, మొదటగా జరిగిన టాటా ఇండస్ట్రీస్ ఇజిఎమ్‌లోనే మిస్ర్తికి ఎదురుదెబ్బ తగిలింది. తనకు మద్దతివ్వాలని ఇప్పటికే భాగస్వాములను మిస్ర్తి కోరుతున్నది తెలిసిందే. అయితే టాటా గ్రూప్ సంస్థల్లో మెజారిటీ వాటా కలిగిన టాటా సన్స్ ఆధిపత్యమే కొనసాగుతోంది. 2012 డిసెంబర్ 29న రతన్ టాటా వారసుడిగా సైరస్ మిస్ర్తి.. టాటా గ్రూప్ సారథ్య బాధ్యతలను స్వీకరించారు. టాటా సన్స్‌లో సైరస్ మిస్ర్తికి సుమారు 19 శాతం వాటా ఉంది. ఈ క్రమంలోనే టాటా సన్స్ చైర్మన్ అవకాశం మిస్ర్తికి దక్కగా, నాలుగేళ్ల తర్వాత అనూహ్యంగా ఈ ఏడాది అక్టోబర్ 24న ఉద్వాసనకు గురయ్యారు. తొలుత మిస్ర్తి తొలగింపునకు ఎలాంటి కారణం వెల్లడించని టాటా సన్స్.. ఆ తర్వాత టాటా సంస్థల నిర్వీర్యానికి మిస్ర్తి కారకుడవుతున్నాడని ప్రకటించింది. అప్పటి నుంచి టాటా-మిస్ర్తిల మధ్య మాటల యుద్ధం మొదలవగా, టాటా గ్రూపుల్లో పనిచేస్తున్న మిస్ర్తి అనుచరులపైనా టాటాలు వేటు వేశారు. ఇదే క్రమంలో ఇప్పటికీ పలు టాటా సంస్థల చైర్మన్ హోదాలో ఉన్న మిస్ర్తిని తొలగించడంపై టాటాలు దృష్టి పెట్టారు. అందులోభాగంగా టాటా ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా తొలగించి టాటాలు తొలి విజయాన్ని అందుకున్నారు. త్వరలో టాటా స్టీల్, టాటా పవర్, టాటా కెమికల్స్, టాటా మోటార్స్ ఇజిఎమ్‌లూ జరగనున్నాయి.
టాటాలపై వాదియా ధ్వజం
మరోవైపు టాటా గ్రూప్‌లోని ప్రధాన సంస్థల్లో డైరెక్టర్‌గా తన తొలగింపునకు పావులు కదుపుతున్న టాటా సన్స్‌పై నుస్లీ వాదియా ధ్వజమెత్తారు. తాను ఓ స్వతంత్ర డైరెక్టర్‌ను అని తనపై టాటా సన్స్ చర్యలు సరికావన్నారు. ఈ నెల 21న టాటా స్టీల్ ఇజిఎమ్ జరగనున్న క్రమంలో వాదియా ఈ మేరకు సంస్థ భాగస్వాములకు ఓ లేఖ రాశారు. ఏ వ్యక్తితోనూ తనకు సంబంధం ఉండదంటూ మిస్ర్తి వ్యవహారంలో తనను ఇరికించడంపై టాటాలపట్ల అసహనం వ్యక్తం చేశారు. టాటా స్టీల్, టాటా కెమికల్స్, టాటా మోటార్స్‌లలో వాదియా ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు.