బిజినెస్

మనకు భయం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: వడ్డీ రేట్లను పెంచుతూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయంతో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆటుపోట్లకు గురయ్యే అవకాశం లేకపోలేదని, అయితే భారత్ మాత్రం ఈ ప్రభావాన్ని తట్టుకోగల స్థితిలో ఉందని కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ గురువారం ఇక్కడ అన్నారు. అమెరికా ఫెడ్ రిజర్వ్ పావు శాతం వడ్డీ పెంపు ముందు అనుకున్న దానికి అనుగుణంగానే ఉందని, బలమైన స్థూల ఆర్థిక మూలాలు కలిగి ఉన్న భారత్ మిగతా మార్కెట్లతో పోలిస్తే ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ‘అమెరికా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అలాగే డాలరు విలువా పెరుగుతోంది. కనీసం కొంతకాలమైనా అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లనుంచి డాలర్లు అమెరికాకు తరలిపోవచ్చు. అయితే మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో దాని ప్రభావం తక్కువగానే ఉంటుంది’ అని సుబ్రహ్మణ్యన్ అన్నారు. ఈ ఏడాది మధ్యనుంచి ఆర్థిక వృద్ధి వేగం పుంజుకోవడంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం ఈ ఏడాదిలో తొలిసారిగా వడ్డీ రేట్లను పావుశాతం పెంచింది. దశాబ్ద కాలంలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం ఇది రెండోసారి. అయితే ఈ పెరుగుదల ముందు ఊహించిందేనని, అంతేకాకుండా అనుకున్నట్లుగానే ఉందని ఆయన అంటూ, అయితే భారత దేశ ఆర్థిక వ్యవస్థ దీని ప్రభావాన్ని తట్టుకుని నిలబడగల స్థితిలో ఉందని అన్నారు. ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధానం కూడా దీన్ని పరిగణనలోకి తీసుకుంటుందని తాను అనుకుంటున్నట్లు సుబ్రహ్మణ్యం చెప్పారు. స్వల్పకాలంలో కొంత ఆటుపోట్లు ఉండవచ్చు కానీ భారత్ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. దీనిపై ఆర్‌బిఐ సరయిన నిర్ణయమే తీసుకుందని ఆయన అంటూ ఆటుపోట్లు, అనిశ్చితి ఉండే సమయంలో బలమైన స్థూల ఆర్థిక వ్యవస్థ ఉండాలని, అది మనకు ఉందని, అందువల్ల తాను పెద్దగా ఆందోళన చెందడం లేదని అన్నారు. గత వారం ఆర్‌బిఐ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ, పెద్ద నోట్ల రద్దు, అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం ఏ విధంగా ఉంటుందో అంచనా వేయాల్సిన అవసరం ఉందని పేర్కొనడం తెలిసిందే.
కాగా, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచిన తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లనుంచి పెట్టుబడులు తరలిపోయే అవకాశాలు ఉంటాయని, దీని ప్రభావం మార్కెట్లపై కూడా ఉంటుందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీకి చెందిన ఇనె్వస్టర్ సర్వీస్ విభాగం పేర్కొంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను కొద్దికొద్దిగా పెంచుతూ, 2017 చివరి నాటికి 1.25 శాతం లేదా 1.5 శాతం దాకా పెంచే అవకాశముందని కూడా ఆ సంస్థ అభిప్రాయ పడింది.

చిత్రం..న్యూఢిల్లీలో గురువారం ఇష్టాగోష్ఠి కార్య క్రమంలో మాట్లడుతున్న
కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్