బిజినెస్

80 శాతం కొత్త కరెన్సీ వచ్చాకే.. ఆంక్షల సడలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు ఉపసంహరణల (విత్‌డ్రాయల్స్)పై విధించిన ఆంక్షలను సడలించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొత్త కరెన్సీని 80 శాతం మేరకు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత సహకార బ్యాంకులతో మొదలు పెట్టి ఈ ఆంక్షలను సడలించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు గురువారం వెల్లడించారు. పాత నోట్ల మార్పిడి ప్రక్రియ దాదాపు 50 శాతం మేరకు (సుమారు 7.5 లక్షల కోట్ల రూపాయల మేరకు) పూర్తయిందని, దీంతో బ్యాంకుల వద్ద క్యూలు గణనీయంగా తగ్గాయని, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో మాత్రమే ప్రస్తుతం క్యూలు దర్శనమిస్తున్నాయని ఆ అధికారి తెలిపారు. నగదు ఉపసంహరణలపై ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలను తొలుత సహకార బ్యాంకుల్లోనూ, ఆ తర్వాత షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకుల్లోనూ సడలించడం జరుగుతుందని ఆయన చెప్పారు.
దేశంలో అవినీతిని నిర్మూలించడంతో పాటు నల్లధనాన్ని, నకిలీ కరెన్సీని నిరోధించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత నెల 8వ తేదీన పాత 500, 1000 రూపాయల నోట్ల చెలామణిని రద్దుచేసి, వాటి స్థానంలో కొత్త 2000, 500 రూపాయల నోట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. దీంతో నవంబర్ 8వ తేదీ నాటికి దేశ వ్యాప్తంగా చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 86 శాతం కరెన్సీ (రూ.15 లక్షల కోట్లు) రద్దయింది. పెద్ద నోట్ల రద్దుతో పాటు బ్యాంకులు, ఎటిఎంల నుంచి నగదు ఉపసంహరణలపై ప్రభుత్వం పరిమితులను విధించింది. దీంతో ప్రస్తుతం బ్యాంకుల నుంచి ప్రజలు వారానికి గరిష్ఠంగా 24 వేల రూపాయలు, ఎటిఎంల నుంచి రోజుకు గరిష్ఠంగా 2,500 రూపాయలు చొప్పున మాత్రమే ఉపసంహరించుకునేందుకు వీలవుతోంది.
అయితే తొలుత ప్రజలకు తొలుత డబ్బును అందుబాటులోకి తీసుకురావాలని తాము భావిస్తున్నందున అన్ని రకాల కరెన్సీని ఒకేసారి ముద్రించడం లేదని ఆ అధికారి తెలిపారు. కొత్త కరెన్సీ 80 శాతం మేరకు అందుబాటులోకి వచ్చిన తర్వాత నగదు ఉపసంహరణలపై ఆంక్షలను సడలించడం జరుగుతుందని, తొలుత సహకార బ్యాంకుల్లోనూ, ఆ తర్వాత మిగిలిన అన్ని బ్యాంకుల్లోనూ ఈ ఆంక్షలను సడలించడం జరుగుతుందని, పాత నోట్ల మార్పిడి ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాత ఈ ఆంక్షలను పూర్తిగా తొలగించడం జరుగుతుందని ఆయన వివరించారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల రూ.2000 నోట్ల (4 లక్షల కోట్ల రూపాయల) ముద్రణకు ఏర్పాట్లు చేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో తొలుత చెలామణిలోకి వచ్చిన కొత్త నోట్లు ఇవే. ఆ తర్వాత కొత్త 500 రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన రిజర్వు బ్యాంకు ఇప్పుడు కొత్త కరెన్సీని శరవేగంగా ముద్రిస్తోంది. ఇందుకోసం మధ్యప్రదేశ్‌లోని దేవాస్, మహారాష్టల్రోని నాసిక్, పశ్చిమ బెంగాల్‌లోని సల్బోని, కర్నాటకలోని మైసూరులోని నాలుగు ఆర్‌బిఐ ప్రింటింగ్ ప్రెస్‌లు ఓవర్ టైమ్ పనిచేస్తున్నాయి.