బిజినెస్

నష్టాల్లో మినుము రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 16: కాసులు కురిపించాల్సిన ‘అపరాలు’ రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కసారిగా పతనమైన మినుముల ధరలకు రైతులు కుదేలయ్యారు. దీంతో పెద్ద ఎత్తున నిల్వలు ఉంచిన రైతులకు పతనమైన ధరలు దిగాలుపడేలా చేశాయి. గత యేడాదితో పోలిస్తే మినుము ధర ఈ యేడాది పాతాళానికి పడిపోయింది. 50 శాతం పైబడి పడిపోయిన ధరలు రైతుల నడ్డి విరిచాయనే చెప్పవచ్చు. గత యేడాది క్వింటాలు (100కేజీలు) అత్యధికంగా రూ.16వేలు ధర పలకగా ప్రస్తుతం ఆ ధర రూ.5వేలకు పడిపోయి రైతుకు మింగుడు పడకుండా చేసింది. సిరులు కురుస్తాయని ఆశించిన రైతులు భారీ నష్టాలను మూటగట్టుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రమక్రమంగా తగ్గుతున్న మినుము ధర రైతులను మరింత కలవరానికి గురిచేస్తోంది. దీంతో చేసేది లేక పెద్ద ఎత్తున నిల్వ చేసిన మినుములను వచ్చిన కొద్దిపాటి ధరకే అయిన కాడికి అమ్ముకుంటున్నారు. గత ఏడాది పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భూ యజమానులు కౌలును ఒక్కసారిగా పెంచేశారు. అలాగే కౌలురైతులు కూడా మినుము ధరలపై ఉన్న ఆశతో కౌలు చేసేందుకు ముందుకు వచ్చారు. కానీ భిన్నమైన పరిస్థితులు ఏర్పడటంతో రైతుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందాన మారింది. ఎకరాకు 18 నుండి 24 బస్తాలకు కౌలు చేస్తున్నారంటే రైతులు మినుముల ధరలపై ఎంత ఆశ పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కోతలు కోసి మినుము విత్తనాలు వేశారు. మరికొంత మంది కోతలు కోసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఏ పంట వేయాలా వద్దా అనే సందిగ్ధంలో కొంత మంది రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఎక్కువ శాతం మంది రైతులు మాత్రం ధర ఎలా ఉన్నా మినుము సాగు చేసేందుకే మక్కువ చూపుతున్నారు. కానీ ఖరీఫ్‌లో రెండవ పంటగా వేసిన మినుము పంట జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో కోతలకు వస్తుంది. అయితే అప్పుడు కూడా ఇదే విధంగా ధరలు ఉంటే కౌలురైతులు కుదేలవటం ఖాయం.