బిజినెస్

పది నెలల కనిష్ట స్థాయకి పడిపోయన పుత్తడి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: పెద్ద నోట్ల రద్దు కారణంగా కొనుగోళ్లు తగ్గిపోవడంతో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గిపోతున్నాయి. శుక్రవారం బంగారం ధర పదిగ్రాములకు ఏకంగా 500 రూపాయలు తగ్గిపోయి రూ. 28 వేల దిగువకు పడిపోవడమే కాక పది నెలల కనిష్టస్థాయి అయిన రూ. 27,750స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో పాటుగా దేశీయంగా కూడా ఆభరణాల తయారీదారులనుంచి డిమాండ్ లేకపోవడమే బంగారం ధరలు పడిపోవడానికి కారణమని భావిస్తున్నారు. వెండి ధర కూడా కిలోకు 1350 రూపాయలు తగ్గి రూ.39,600కు చేరుకుంది. న్యూయార్క్ మార్కెట్లో గురువారం బంగారం ధర 1.26 శాతం తగ్గి ఔన్స్ 1128.20 డాలర్లకు చేరుకుంది. దేశ రాజదాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత , అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర పది గ్రాములకు 500 రూపాయల మేర పడిపోయింది.