బిజినెస్

కోస్తాలో ‘ఆక్వా’ సాగుకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 9: కోస్తా తీరంలో ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలుచేస్తోంది. ఉప్పునీరు, మంచినీటి చెరువుల్లో రొయ్యల సాగు చేపట్టడానికి ముందుకువచ్చే రైతులకు సకాలంలో తవ్వకాలకు అనుమతులు మంజూరు చేస్తోంది. సాగుదారులకు బ్యాంకుల ద్వారా రుణాల కల్పనకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. అలాగే మెరుగైన యాజమాన్య విధానాలు, శాస్ర్తియ పద్ధతులపై సాగుదారులకు అవగాహన కలిగిస్తూ, సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవల్సిందిగా కోస్తా జిల్లాల మత్స్యశాఖాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఏడాది 28 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తుల ద్వారా రూ. 38 వేల కోట్ల ఆదాయాన్ని సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఆక్వా ఎగుమతుల ద్వారా దేశానికి రూ. 33,400 విదేశీ మారకద్రవ్యం సమకూరుతుండగా అందులో రూ. 14 వేల కోట్లు ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల నుండే సమకూరుతోంది. ఆక్వా రంగాన్ని మరింత ప్రోత్సహిస్తే ఫలితాలు కూడా మరింత ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్న ప్రభుత్వం.. ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఆక్వా రంగాభివృద్ధికి ఇటీవల రూ. 330 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. వివిధ దేశాలలో రొయ్యల పెంపకంపై తీసుకుంటున్న అభివృద్ధి చర్యలు, ప్రయోగాలు, సాగు విధానంలో మార్పులపై స్థానిక సాగుదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కలిగించేలా చర్య లు తీసుకుంటున్నారు. ఆక్వా రంగంలో ఎదురవుతున్న సవాళ్లపై కూడా తగు జాగ్రత్తలు తీసుకునేలా అప్రమత్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ నెలాఖరుకు 160 ఉత్పత్తి సంఘాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క సంఘంలో పది వేల మంది రైతులను సభ్యులుగా చేర్చి, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో ఈ సంఘాలను అనుసంధానించనున్నారు. కాగా, కోస్తా లో మత్స్య పరిశ్రమను ప్రోత్సహించడానికి 50 శాతం రాయితీపై మత్స్యకారులకు వలలు, ఇతర పరికరాలను మంజూరు చేస్తున్నారు. మరోవైపు మత్స్యకారులను ప్రమాద సమయంలో ఆదుకోవడానికి పడవలకు ఏర్పాటుచేసే డిస్ట్రస్ అలర్ట్ ట్రాన్స్‌మీటర్ (డాట్) పరికరాలను పూర్తి ఉచితంగా ప్రభుత్వం అందిస్తోంది. దీనిలో 75 శాతాన్ని ప్రభుత్వం భరిస్తుండగా, 25 శాతం నిధులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద కేటాయిస్తున్నారు.
1,068 ఎకరాల్లో సాగుకు అనుమతి
తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఇటీవల రొయ్యల చెరువుల తవ్వకాలకు 373 దరఖాస్తులు అందాయి. వీటిలో అర్హత కలిగిన సుమారు 1,068 ఎకరాల విస్తీర్ణంలోని చెరువులకు అనుమతులు జారీ చేశారు. రెన్యువల్ కొరకు దరఖాస్తు చేసుకున్న 658 చెరువులకు కూడా అనుమతులిచ్చారు. అయతే ఆక్వా రైతులకు బ్యాంకు రుణాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో జిల్లాలో సాగులో ఉన్న చెరువులకు ఫారం-సి అనుమతిని తప్పనిసరిగా పొందాలని అధికారులు స్పష్టంచేశారు. ప్రొవిజనల్ అనుమతులు పొంది, నిబంధనలు సక్రమంగా పాటిస్తూ సాగు చేస్తున్న రైతులకు ఫారం-సి అనుమతులు సత్వరం జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా ఫారం-సి అనుమతి పొందిన రైతులు బ్యాంకుల నుండి రుణాలు తీసుకునేందుకు అర్హులవుతారు.