బిజినెస్

కొత్త నోట్లు ఎక్కువేమీ రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: రద్దయిన నోట్ల స్థానంలో వస్తున్న కొత్త నోట్లు అంతే స్థాయిలో రాకపోవచ్చన్న సంకేతాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం పాత 500, 1,000 రూపాయల నోట్లను మోదీ సర్కారు గత నెల 8వ తేదీ రాత్రి రద్దు చేసినది తెలిసిందే.
ఆ సమయం వరకు చలామణిలో 15.44 లక్షల కోట్ల రూపాయల విలువైన 500, 1,000 రూపాయల నోట్లున్నాయి. అయితే ఇంతే విలువ కలిగిన కొత్త నోట్లను చలామణిలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని శనివారం ఇక్కడ జరిగిన ఫిక్కీ సాధారణ వార్షిక సమావేశంలో పాల్గొన్న జైట్లీ అన్నారు. నగదు రహిత లావాదేవీలను కేంద్రం ప్రోత్సహిస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే నోట్ల ముద్రణను తగ్గించే వీలు కనిపిస్తోంది. మరోవైపు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 16 మధ్య ఎప్పుడైనా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి రావచ్చని జైట్లీ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖల్ని జిఎస్‌టి మార్చుతుందని కేంద్రం బలంగా విశ్వసిస్తోంది. అయితే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ ప్రతిష్టాత్మక బిల్లు అమలుతో తమ ఆదాయం పోతుందన్న ఆందోళనల్ని పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో దీని అమలు తొలుత అనుకున్నట్లుగా వచ్చే ఏప్రిల్ 1 నుంచి జరిగేలా కనిపించడం లేదు. జైట్లీ నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో దీనికి సంబంధించి చర్చలు కూడా జరుపుతోంది.
ఇదిలావుంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017-18)గాను రూపొందిస్తున్న కేంద్ర బడ్జెట్.. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఊతమిచ్చేలా ఉంటుందని జైట్లీ అన్నారు.
కాగా, పాత పెద్ద నోట్లు రద్దయిన నేపథ్యంలో చలామణిలోకి 5.50 లక్షల కోట్ల రూపాయల విలువైన కొత్త నోట్లు వచ్చాయని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ శనివారం ఇక్కడ ఓ న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ చెప్పారు.

చిత్రం..ఫిక్కీ సాధారణ వార్షిక సమావేశంలో మాట్లాడుతున్న జైట్లీ