బిజినెస్

మళ్లీ హెచ్‌డిఎఫ్‌సి మసాలా బాండ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 17: మసాలా బాండ్లతో దేశీయ మార్ట్‌గేజ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి మరోసారి చేయబోయే నిధుల సమీకరణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఆమోదం లభించింది. ఇప్పటికే మసాలా బాండ్ల జారీ ద్వారా 5,000 కోట్ల రూపాయలను హెచ్‌డిఎఫ్‌సి పొందింది. అయితే ఇదే పద్ధతిన మరిన్ని నిధుల కోసం హెచ్‌డిఎఫ్‌సి సిద్ధమవగా, మరో 3,000 కోట్ల రూపాయల వరకు అందుకోవచ్చని ఆర్‌బిఐ అనుమతిచ్చింది. కానీ ఈ విషయంలో ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులనుబట్టి వేచిచూసే ధోరణిని అవలంభించదలుచుకున్నట్లు సంస్థ వైస్ చైర్మన్, సిఇఒ కెకి మిస్ర్తి విలేఖరులకు తెలిపారు. ముఖ్యంగా అమెరికా రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచిన క్రమంలో ఆచితూచి స్పందిస్తామని చెప్పారు. కాగా, కనీసం ఐదేళ్ల కాలపరిమితితో జారీచేసే ఈ రూపీ లింక్డ్ బాండ్లను విదేశీ మదుపరులకు దేశీయ సంస్థలు విక్రయిస్తాయి. తద్వారా డాలర్లను పొందుతాయి. ఏడాదికి గరిష్ఠంగా 750 మిలియన్ డాలర్ల (ప్రస్తుతం భారత కరెన్సీ విలువ ప్రకారం 5,000 కోట్ల రూపాయలు)కు మించి మసాలా బాండ్ల ద్వారా నిధులను పొందరాదు.