బిజినెస్

ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు సౌమిత్ర చౌధురి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు సౌమిత్ర చౌధురి కన్నుమూశారు. అనేక ప్రభుత్వ ఉన్నతస్థాయి సలహా సంఘాల్లో పనిచేసిన చౌధురి.. ఆదివారం ఉదయం చనిపోయారు. ఆయన లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు చౌధురి మేనల్లుడు అభిక్ తెలియజేశారు. చౌధురి వయసు దాదాపు 63 ఏళ్లు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించామని, వారం రోజులుగా చికిత్స పొందిన ఆయన ఆదివారం ఉదయం 8 గంటలకు తుదిశ్వాస విడిచారని అభిక్ చెప్పారు. 1954 జనవరి 11న జన్మించిన చౌధురి.. 2005 నుంచి ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారు మండలి సభ్యుడిగా, 2009 జూన్ నుంచి ప్రణాళికా సంఘం సభ్యుడిగా ఉన్నారు. దువ్వూరి సుబ్బారావు తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రేసులో కూడా చౌధురి ఉన్నారు.