బిజినెస్

తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహణ కొనసాగుతోంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గత నెలలో దాదాపు 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న మదుపరులు.. ఈ నెలలో ఇప్పటిదాకా 3 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక, తదనంతర పరిణామాల ప్రభావం కూడా భారత్‌సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది. యూరోజోన్ సభ్యత్వంపై ఇటలీ రెఫరెండమ్ కూడా మార్కెట్లపై ప్రభావం చూపించింది. అంతకుముందు నెల అక్టోబర్‌లో 10,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను గుంజేసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరులు (ఎఫ్‌పిఐ).. నవంబర్ నెలా అదే దారిలో పయనించారు. నవంబర్ ట్రేడింగ్‌లో అటు స్టాక్ మార్కెట్ల నుంచి ఇటు రుణ మార్కెట్ల నుంచి 39,396 కోట్ల రూపాయల (5.78 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
స్టాక్ మార్కెట్ల నుంచి 18,244 కోట్ల రూపాయలు, రుణ మార్కెట్ల నుంచి 21,152 కోట్ల రూపాయలు తరలిపోయాయ. నిజానికి సెప్టెంబర్‌లో పెట్టుబడులను తీసుకొచ్చిన మదుపరులు.. అక్టోబర్‌లో మాత్రం వెనక్కి తగ్గారు. ముఖ్యంగా రుణ మార్కెట్ల నుంచి భారీ స్థాయలో పెట్టుబడులను ఎఫ్‌పిఐలు ఉపసంహరించుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వడ్డీరేట్ల తగ్గింపు దీనికి ప్రధాన కారణమని, బాండ్లకు డిమాండ్ తగ్గడంతో రుణ మార్కెట్లు పడిపోయాయని ఎస్‌ఎఎస్ ఆన్‌లైన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సిద్ధాంత్ జైన్ అన్నారు. దీంతో రుణ మార్కెట్ల నుంచి అక్టోబర్‌లో 6,000 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు పోయాయ. కానీ సెప్టెంబర్లో 9,789 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం గమనార్హం. స్టాక్ మార్కెట్ల నుంచి కూడా 4,306 కోట్ల రూపాయల పెట్టుబడులు వెనక్కిపోయాయ. దీంతో అటు రుణ, ఇటు స్టాక్ మార్కెట్ల నుంచి అక్టోబర్‌లో 10,306 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోయనట్లైంది. ఈ క్రమం లో నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు దేశీయ మార్కెట్లనూ ప్రభావితం చేసింది. అలాగే అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచనుందన్న సంకేతాలూ విదేశీ మదుపరులను భయ కంపితులను చేస్తున్నాయ. అక్టోబర్‌కు ముందు భారతీయ మార్కెట్లలో పెట్టుబడులపట్ల విదేశీ మదుపరులు ఆసక్తినే కనబరిచారు. సెప్టెంబర్‌లో స్టాక్ మార్కెట్లలోకి 10,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తీసుకురావడంతో రుణ, స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలు వచ్చినట్లైంది. గడచిన 11 నెలల్లో ఈ స్థాయలో పెట్టుబడులు రావడం ఇదే ప్రథమం. నిరుడు అక్టోబర్‌లో 22,350 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా, మళ్లీ ఆ తర్వాత ఈ సెప్టెంబర్‌లోనే ఆ స్థాయలో పెట్టుబడులు వచ్చాయ. పార్లమెంట్‌లో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఏకగ్రీవంగా ఆమోదం పొందడం, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను వివిధ సంస్థలు ప్రకటించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుండటం వంటివి దేశీయ స్టాక్, రుణ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులను అమితంగా రప్పించాయ. అంతకుముందు రెండు నెలల్లోనూ విదేశీ పెట్టుబడులు భారతీయ మార్కెట్లలోకి భారీగానే వచ్చాయ. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో కరెంట్ ఖాతా లోటు జిడిపిలో 0.1 శాతానికి తగ్గడం, వాహన అమ్మకాలు కూడా ఆశాజనకంగా నమోదు కావడం వంటివి కలిసొచ్చాయ. నిజానికి ఈ ఏడాది తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన ఎఫ్‌పిఐలు.. తర్వాతి మూడు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టించారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో స్టాక్ మార్కెట్లలో 32,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను ఎఫ్‌పిఐలు గుమ్మరించారు. అంతకుముందు రెండు నెలలతో పోల్చితే మే నెలలో వచ్చిన విదేశీ పెట్టుబడులు మాత్రం తక్కువే. 2,543 కోట్ల రూపాయల పెట్టుబడులే భారత స్టాక్ మార్కెట్లకు వచ్చాయ. ఇక జనవరి, ఫిబ్రవరిలో 16,647 కోట్ల రూపాయల పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు గుంజేసుకోగా, నిరుడు నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఏకంగా 41,661 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు.
కాగా, ఈ ఏడాది జనవరి-జూన్‌లో స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. జూలై-సెప్టెంబర్ వ్యవధిలో భారతీయ మార్కెట్లలోకి 46,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చిన విదేశీ మదుపరులు.. అక్టోబర్-నవంబర్‌లో మాత్రం 49,700 కోట్ల రూపాయల పెట్టుబడులను లాగేసుకున్నారు. ఈ నెలలోనూ స్టాక్ మార్కెట్ల నుంచి 1,142 కోట్ల రూపాయలు, రుణ మార్కెట్ల నుంచి 18,452 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలిపోయాయ. వెనక్కి వెళ్లిపోయన విదేశీ పెట్టుబడుల విలువ మొత్తం 19,594 కోట్ల రూపాయలుగా నమోదైంది. మరోవైపు ఈ సంవత్సరం మొదలు ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లలోకి 27,600 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చిన విదేశీ మదుపరులు.. రుణ మార్కెట్ల నుంచి 43,162 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకున్నారు.