బిజినెస్

6 టాటా సంస్థలకు మిస్ర్తి గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 19: టాటా-మిస్ర్తిల వివాదం సరికొత్త మలుపు తీసుకుంది. తనను అన్యాయంగా తొలగించారంటూ టాటాలపై దాదాపు రెండు నెలల నుంచి ఎదురుదాడి చేస్తున్న సైరస్ మిస్ర్తి.. సోమవారం అనూహ్యంగా ఆరు ప్రధాన టాటా గ్రూప్ సంస్థల బోర్డుల నుంచి తప్పుకున్నారు. అయితే రతన్ టాటాపై తన పోరును మాత్రం ఆపబోనని మిస్ర్తి తేల్చిచెప్పారు. 100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన 100కుపైగా సంస్థలున్న టాటా గ్రూప్‌నకు ప్రాతినిథ్యం వహిస్తున్న టాటా సన్స్ చైర్మన్‌గా మిస్ర్తిపై ఈ ఏడాది అక్టోబర్ 24న టాటాలు వేటు వేసినది తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్‌లోని ఒక్కో సంస్థ బోర్డు నుంచీ మిస్ర్తిని టాటాలు తప్పిస్తున్నారు. ఈ నెలలో ఐదు సంస్థల బోర్డు సమావేశాలు జరగనుండగా, అంతకుముందే ఊహించనివిధంగా స్టాక్ మార్కెట్లలో లిస్టయిన ఆరు సంస్థల నుంచి మిస్ర్తి బయటికొచ్చారు. ఇండియన్ హోటల్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా కెమికల్స్ తదితర సంస్థల బోర్డులకు మిస్ర్తి టాటా చెప్పేశారు. ప్రస్తుతం టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా కొనసాగుతుండగా, కొత్త చైర్మన్ కోసం అనే్వషణ జరుగుతోంది. మిస్ర్తి చర్యలు టాటా గ్రూప్ నిర్వీర్యానికి దారితీస్తున్నాయని టాటాలు అంటుంటే, అధికారం ఒక్కరి చేతుల్లోనే ఉందంటూ రతన్ టాటాపై మిస్ర్తి విమర్శలు గుప్పిస్తున్నది తెలిసిందే.

చిత్రం..సోమవారం బాంబే హౌస్‌లో జరిగిన సమావేశానికి హాజరైన మిస్ర్తి