బిజినెస్

పిఎఫ్ వడ్డీరేట్లను తగ్గించిన ఇపిఎఫ్‌ఒ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు/న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను ఉద్యోగ భవిష్య నిధి ఇపిఎఫ్‌ఒ.. ఇపిఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటును తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) 8.8 శాతం వడ్డీరేటును ఇచ్చిన ఇపిఎఫ్‌ఒ.. ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం దాన్ని 8.65 శాతానికే పరిమితం చేసింది. ఈ మేరకు సోమవారం బెంగళూరులో జరిగిన సమావేశంలో ఇపిఎఫ్‌ఒ నిర్ణాయక మండలి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సిబిటి) తీర్మానించినట్లు ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అశోక్ సింగ్ పిటిఐకి తెలిపారు. దీన్ని భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి వీర్జేశ్ ఉపాధ్యాయ్ కూడా స్పష్టం చేశారు. నిజానికి ఇపిఎఫ్‌ఒ ఆదాయ అంచనాల ప్రకారం 2016-17కూ వడ్డీరేటును 8.8 శాతంగానే ఉంచాలనుకున్నారు. కానీ మిగులు నిధులను వాడుకోవాలని సిబిటి నిర్ణయించడంతో వడ్డీరేట్లు తగ్గక తప్పలేదు. మొత్తానికి తాజా నిర్ణయం ఇపిఎఫ్‌ఒలోని 5 కోట్లకుపైగా ఖాతాదారులపై ప్రభావం చూపనుంది. కాగా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) తదితర ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై చెల్లిస్తున్న వడ్డీరేటుకు అనుగుణంగానే ఇపిఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటును నిర్ణయంచాలని కార్మిక శాఖను ఆర్థిక శాఖ కోరుతోంది. ఈ క్రమంలోనే వడ్డీరేటు తగ్గడం గమనార్హం. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేటును అక్టోబర్-డిసెంబర్‌కుగాను స్వల్పంగా 0.1 శాతం మేర కేంద్రం తగ్గించినది తెలిసిందే.