బిజినెస్

వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 20: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. గత నాలుగు రోజులుగా నష్టపోతున్న సూచీలు మంగళవారం కూడా క్షీణించగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 66.72 పాయింట్లు పడిపోయి 26,307.98 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 21.95 పాయింట్లు దిగజారి 8,082.40 వద్ద నిలిచింది. బ్యాంకింగ్, హెల్త్‌కేర్, పిఎస్‌యు, మెటల్, ఆటో రంగాల షేర్ల విలువ 1.26 శాతం నుంచి 0.84 శాతం మేర పడిపోయింది. పాత పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలు, ఐరోపాలో చోటుచేసుకున్న తీవ్రవాద దాడులు, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్యసమీక్ష తదితర కారణాలతో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. ఇకపోతే అంతర్జాతీయం గా ఆసియా మార్కెట్లలో ప్రధాన సూచీలైన హాంకాంగ్, చైనా సూచీలు నష్టపోతే జపాన్ సూచీ లాభపడింది. ఐరోపా మార్కెట్లలోనూ కీలక సూచీలైన జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు నష్టపోగా, బ్రిటన్ సూచీ లాభపడింది.