బిజినెస్

కావల్సినన్ని నగదు నిల్వలున్నాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఎదురవుతున్న నగదు కొరతను ఎదుర్కొనేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అన్నివిధాలా సిద్ధంగానే ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. నోట్ల రద్దు జరిగిన నాటి నుంచి ఒక్కరోజు కూడా విరామం లేకుండా ముద్రణ చేస్తోందని మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ జైట్లీ చెప్పారు. డిసెంబర్ 30 తర్వాత కూడా ముద్రణ జరుగుతుందని ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. మరోవైపు బ్యాంకర్లతో ముందస్తు బడ్జెట్ చర్చలను జైట్లీ జరిపారు. ఈ చర్చల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకర్లంతా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తమ బ్యాంక్ సిబ్బంది అక్రమాలపై చర్యలు తీసుకుంటామని యాక్సిస్ బ్యాంక్ సిఇఒ శిఖా శర్మ తెలిపారు. ఈ విషయాన్ని తనతో చెప్పినట్లు జైట్లీ ఈ సందర్భంగా వివరించారు. ఇకపోతే నోట్ల రద్దు నేపథ్యంలో చిరు వ్యాపారులకు పన్ను మినహాయింపులు కల్పిస్తామని జైట్లీ హామీ ఇచ్చారు.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా చర్యలు చేపడతామని అన్నారు. 2 కోట్ల రూపాయల టర్నోవర్ వరకు పన్నులు చెల్లించనక్కర్లేదని పేర్కొన్నారు. కాగా, బ్యాంకులు అధిక మూలధన సాయాన్ని అడుగుతుండటంపై జైట్లీ స్పందిస్తూ దీనిపట్ల ఓసారి ఆలోచించాలని సూచించారు.

చిత్రం..బ్యాంకర్లతో ముందస్తు బడ్జెట్ చర్చలను నిర్వహిస్తున్న జైట్లీ